Anakapalli : యువకుడిని సముద్రంలోకి లాక్కెళ్లిన చేప.. చివరకు

Update: 2025-07-04 06:15 GMT

అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందాడు. అచ్చుతాపురం మండలం పూడిమడక గ్రామానికి చెందిన చౌడపల్లి ఎర్రయ్య తన నలుగురు స్నేహితులతో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వీరు వేట కొనసాగిస్తుండగా వీరికి 200 కేజీల బండ కోనేమ్ అనే భారీ చేప వలకు చిక్కింది. దానిని పడవలోకి లాగే ప్రయత్నంలో ఎర్రయ్యను చాప సముద్రంలోకి లాక్కెళ్లింది.ఎర్రయ్య కోసం ఎంత వెతికిన ఆచూకీ లభించలేదని అతడి ఫ్రెండ్స్ బోరున విలపించారు. ఈ విషయం అధికారులకు చెప్పినా ఎవరూ స్పందించలేదని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి తన బిడ్డ మృతదేహాన్ని అప్పగించాలని ఎర్రయ్య తల్లి, సోదరుడు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News