Visakhapatnam : తల్లి మృతి తట్టుకోలేక తనువు చాలించిన కూతురు... విశాఖపట్నంలో విషాదం..

Update: 2025-07-18 12:15 GMT

తనను నవ మాసాలు మోసి కని పెంచిన తల్లి ఇక లేదని తెలిసి ఆ కూతురు తట్టుకోలేకపోయింది. అమ్మ లేకుండా ఈ లోకంలో ఎలా బ్రతకాలో తెలియక కన్నీరు మున్నిరయ్యింది. అమ్మ ఇక రాదని , తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిందని తెలిసి ఆమె గుండె తట్టుకోలేకపోయింది. తల్లితో పాటే తాను కూడా వెళ్తానని అనుకుందో ఏమో గానీ...ఆ దేవుడు తన కోరిక తీర్చాడు. తల్లితో పాటు కూతురు నీ కూడా తన దగ్గరకు తీసుకెళ్లాడు. విశాఖ పట్నం భోగాపురంలో జరిగిన తల్లి, కూతుళ్ల మరణాలు అందరిని కలిచి వేశాయి.

భోగాపురంకు చెందిన ఆళ్ల వనజాక్షి(57) గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. వనజాక్షికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమారైలు కాగా చిన్న కుమారుడు ఆళ్ల అచ్యుతరావు కొన్నేళ్ల క్రితమే మరణించాడు. వనజాక్షి మృతి గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఐతే వనజాక్షి చిన్న కుమారై విజయలక్ష్మి(28) తన తల్లి మృతిని తట్టుకోలేకపోయింది. తీవ్రంగా విలపిస్తూ అక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఆమె బంధువులు ఆసుపత్రి కి తరలిస్తుండగా మార్గమధ్యంలోని ప్రాణాలు కోల్పోయింది. తల్లి కూతుర్లు ఒకేసారి చనిపోవడంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News