TTD : ఏపీటీఏకు కేటాయించిన భూమిని టీటీడీకి బదలాయించండి

Update: 2025-05-08 06:15 GMT

ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఏడుకొండలకు ఆనుకొని ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించరాదని టీటీడీ బోర్డు చైర్మన్ బిర్ నాయుడు తెలిపారు. ఇది వరకే తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామంలోని సర్వే నెం.604లో ఏపీ టూరిజం అథారిటీ (ఏపీటీఏ) కు చెందిన 24.68 ఎకరాల భూమిని టీటీడీకి బదలాయించాలని గతంలో టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయాలు తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ట్విట్టర్లో తెలిపారు. ఆ స్థలానికి బదులుగా తిరుపతి అర్బన్ సర్వే నెం. 588ఏ లో ఉన్న టీటీడీకి చెందిన 24.68 ఎకరాల స్థలాన్ని ఏపీటీఏ కు బదలాయింపునకు టీటీడీ బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. అదేవిధంగా తిరుపతి రూరల్ లోని సర్వే నెం.604 లోని ఏపీ టీఏకు చెందిన మరో 10.32 ఎకరాల స్థలాన్ని టీటీడీకి బదలాయించడం, దానికి బదులుగా తిరుపతి అర్బన్ లోని సర్వే నెంబర్ 588ఏ లోని టీటీడీకి చెందిన 10.32 ఎకరాల స్థలాన్ని ఏపీటీఏకు కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని టీటీడీ బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.

Tags:    

Similar News