A.P : ఏపీలో పలువురి ఐఎఫ్‌ఎస్‌ల బదిలీలు.. ఉత్తర్వులు జారీ..

Update: 2025-09-11 06:25 GMT

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఏపీ ప్రభుత్వం పాలనాపరమైన వ్యవహారాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 11 మంది ఐఎఫ్‌ఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా పలువురికి కీలక బాధ్యతలను అప్పగించారు.

తాజా ఉత్తర్వుల ప్రకారం...పర్యావరణ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా రాజేంద్ర ప్రసాద్ నియమితులయ్యారు. అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా ఎస్.ఎస్. శ్రీధర్ భాద్యతలు స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా శ్రీ శర్వాణన్ ను నియమించారు. అదేవిధంగా ఇతర కీలక పోస్టుల్లోనూ మార్పులు జరిగాయి. అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రీజినల్ మేనేజర్ గా శ్రీకాంతనాథ రెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్ గా బి.విజయ్ కుమార్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కర్నూలు సర్కిల్ గా బి.వి.ఎ. కృష్ణమూర్తి నియమితులయ్యారు. పాలనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags:    

Similar News