TS ASSEMBLY: జగన్ మె­డ­పై అన­ర్హత కత్తి.!

ఈనెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. జగన్‌కు అనర్హత ముప్పు ఉందన్న డిప్యూటీ స్పీకర్.. 60 రోజులు సభకు రాకపోతే వేటు తప్పదన్న రఘురామ.. సంచలనంగా మారిన రఘురామరాజు కామెంట్స్

Update: 2025-09-07 03:30 GMT

వై­సీ­పీ అధి­నేత, మాజీ ము­ఖ్య­మం­త్రి వై­ఎ­స్ జగన్ 60 రో­జు­లు అసెం­బ్లీ సమా­వే­శా­ల­కు హా­జ­రు­కా­క­పో­తే ఆటో­మే­టి­క్‌­గా డిస్ క్వా­లి­ఫై అయి­పో­తా­ర­ని అసెం­బ్లీ డి­ప్యూ­టీ స్పీ­క­ర్ రఘు­రామ కృ­ష్ణం­రా­జు చే­సిన వ్యా­ఖ్య­లు ఇప్పు­డు ఏపీ రా­జ­కీ­యా­ల్లో చర్చ­కు దారి తీ­శా­యి. ప్ర­తి­ప­క్ష హోదా ఇస్తే­నే అసెం­బ్లీ­లో అడు­గు పె­డ­తా­నం­టూ వై­ఎ­స్ జగన్ చే­స్తు­న్న వ్యా­ఖ్య­ల­పై రఘు­రామ తీ­వ్ర వ్యా­ఖ్య­లు చే­శా­రు. వై­ఎ­స్ జగన్ చంటి పి­ల్లొ­డి­లా ప్ర­వ­ర్తి­స్తు­న్నా­ర­ని మం­డి­ప­డ్డా­రు. చం­ద­మా­మా కోసం మా­రాం చే­సి­న­ట్లు­గా దక్క­ని ప్ర­తి­ప­క్ష హోదా కోసం మా­రాం చే­య­డం ఏమి­టం­టూ సె­టై­ర్లు వే­శా­రు. ఈసా­రి జరి­గే అసెం­బ్లీ సమా­వే­శా­ల­కు వై­ఎ­స్ జగన్ రా­క­పో­తే పు­లి­వెం­దుల అసెం­బ్లీ­కి ఉప ఎన్ని­క­లు రా­వ­డం ఖాయం అని అసెం­బ్లీ డి­ప్యూ­టీ స్పీ­క­ర్ రఘు­రామ కృ­ష్ణం­రా­జు చె­ప్పు­కొ­చ్చా­రు. దీం­తో ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­జ­కీ­యా­ల్లో పు­లి­వెం­దుల మరో­సా­రి చర్చ­లో­కి వచ్చిం­ది. ఇటీ­వల అక్కడ జరి­గిన జె­డ్పీ­టీ­సీ ఉప ఎన్ని­క­లో వై­సీ­పీ అం­చ­నా­లు తా­రు­మా­ర­య్యా­యి. ఎన్నా­ళ్లు­గా తమ గడ­ప­లో ఓటమి అనే మాట వి­న­న­ని వై­సీ­పీ, ఈసా­రి మా­త్రం గట్టి ఎదు­రు­దె­బ్బ తిం­ది. దీం­తో­నే ఇప్పు­డు అక్క­డి అసెం­బ్లీ సీటు భవి­ష్య­త్తు గు­రిం­చే చర్చ­లు మొ­ద­ల­య్యా­యి. ము­ఖ్యం­గా జగన్ ప్రా­తి­ని­ధ్యం వహి­స్తు­న్న పు­లి­వెం­దుల సీటు కూడా ప్ర­మా­దం­లో పడు­తుం­దా అన్న అను­మా­నా­లు పె­రు­గు­తు­న్నా­యి.

11 స్థానాలకు ఉప ఎన్నికలంటూ కామెంట్స్

ఏ పా­ర్టీ­కి చెం­దిన ఎమ్మె­ల్యే­లు అయి­నా సరే శాసన సభా­స­మా­వే­శా­ల­ను బహి­ష్క­రి­స్తే ఆ పద­వి­కి అర్హత లే­న­ట్లు­గా­నే భా­విం­చా­ల్సి వస్తోం­ది అని డి­ప్యూ­టీ స్పీ­క­ర్ రఘు­రామ కృ­ష్ణం­రా­జు పే­ర్కొ­న్నా­రు. వయ­సు­లో పె­ద్ద­వా­డి­గా, శా­స­న­స­భా ఉప­స­భా­ప­తి­గా వై­ఎ­స్ జగ­న్‌­ను అసెం­బ్లీ సమా­వే­శా­ల­కు హా­జ­రు­కా­వా­ల­ని తాను ఆహ్వా­ని­స్తు­న్న­ట్లు చె­ప్పు­కొ­చ్చా­రు. ఈసా­రి జరి­గే అసెం­బ్లీ సమా­వే­శా­ల­కు హా­జ­ర­య్యేం­దు­కు వై­ఎ­స్ జగన్ సి­ద్ధ­మా అని...సి­ద్ధం అయి­తే తన సవా­ల్‌­ను వై­ఎ­స్ జగన్ స్వీ­క­రిం­చా­ల­ని కో­రా­రు. ఒక­వేళ రాని పక్షం­లో వై­సీ­పీ గె­లి­చిన 11 స్థా­నా­ల­కు కూడా ఉప ఎన్ని­క­లు వచ్చే అవ­కా­శం ఉం­ద­ని అసెం­బ్లీ డి­ప్యూ­టీ స్పీ­క­ర్ రఘు­రామ కృ­ష్ణం­రా­జు స్ప­ష్టం చే­శా­రు. ఈ క్ర­‌­మం­లో అధి­కా­ర­ప­క్షం దూ­కు­డు పెం­చే అవ­కా­శం కని­పి­స్తోం­ది. సభకు రా­కుం­డా ప్ర­శ్న­లు అడి­గే వా­రి­ని అను­మ­‌­తిం­చే­ది లే­ద­‌­ని స్పీ­క­ర్ అయ్య­న్న­పా­త్రు­డు స్ప­ష్టం చే­శా­రు.

ఆ నిర్ణయంతో రాజకీయ నష్టం

వై­సీ­పీ అధి­నేత వై­ఎ­స్ జగన్ ఇలా­నే అసెం­బ్లీ బహి­ష్క­రణ కొ­న­సా­గి­స్తే మె­ు­ద­టి­కే మోసం వచ్చే ప్ర­మా­దం ఉంది. ప్ర­ధాన ప్ర­తి­ప­క్ష హోదా దే­వు­డె­రు­గు తన శా­స­న­సభ సభ్య­త్వా­ని­కే దూరం కా­వా­ల్సి వస్తుం­ది. ఇది కే­వ­లం ప్ర­తి­ప­క్ష హోదా కో­ల్పో­వ­డం కన్నా చాలా పె­ద్ద రా­జ­కీయ నష్టం. పు­లి­వెం­దుల ప్ర­జ­లు తనపై ఉం­చిన నమ్మ­కా­న్ని, ఇచ్చిన తీ­ర్పు­ను కూడా అగౌ­ర­వ­ప­రి­చి­న­ట్టు అవు­తుం­ది అని రా­జ­కీయ వి­శ్లే­ష­కు­లు భా­వి­స్తు­న్నా­రు. రా­జ్యాంగ ని­బం­ధ­న­లు శా­శ్వ­తం. పంతం కోసం పద­వి­ని పణం­గా పె­ట్ట­డం రా­జ­కీ­యం­గా ఆత్మ­హ­త్యా­స­దృ­శం అవు­తుం­ది. పంతం కన్నా పద­వి­ని, రా­జ­కీయ ఉని­కి­ని కా­పా­డు­కో­వ­డా­ని­కే ఆయన మొ­గ్గు చూపే అవ­కా­శం వుం­ది. ఆయన అసెం­బ్లీ­కి తి­రి­గి రా­వ­డం అని­వా­ర్యం­గా తె­లు­స్తోం­ది. వై­ఎ­స్ జగన్ అసెం­బ్లీ సమా­వే­శా­ల­కు గై­ర్హా­జ­రు­కా­వ­డా­ని­కి ఒక లి­మి­ట్ ఉంది అని రా­జ్యాంగ ని­పు­ణు­లు చె­ప్తు­న్నా­రు. అసెం­బ్లీ సమా­వే­శా­ల­కు డు­మ్మా కొ­ట్టేం­దు­కు కొ­న్ని రో­జు­లు మా­త్ర­మే గడు­వు ఉం­టుం­ద­ని ఆ పరి­ధి దా­టి­తే వే­టే­న­ని అం­టు­న్నా­రు. భారత రా­జ్యాం­గం­లో­ని ఆర్టి­క­ల్ 190(4) ప్ర­కా­రం సభ అను­మ­తి లే­కుం­డా ఒక సభ్యు­డు వరు­స­గా 60 సమా­వేశ ది­నా­లు గై­ర్హా­జ­రై­తే, ఆ సభ్యు­డి స్థా­నా­న్ని ఖా­ళీ­గా ప్ర­క­టిం­చే అధి­కా­రం శా­స­న­స­భ­కు ఉం­టుం­ది.

వైపీపీ మొగ్గు గైర్హాజరు వైపే

వై­సీ­పీ మా­త్రం గై­ర్హా­జ­రు కొ­న­సా­గిం­చా­ల­ని భా­వి­స్తోం­ద­న్న ప్ర­చా­రం ఉంది. అలాం­టి పరి­స్థి­తి­లో కూ­ట­మి ప్ర­భు­త్వం మరింత దూ­కు­డు ప్ర­ద­ర్శిం­చే అవ­కా­శం ఉం­ద­ని అం­టు­న్నా­రు. 11 స్థా­నా­లు ఖాళీ అయి­తే ఉప ఎన్ని­క­లు జరి­గి, అధి­కా­రం­లో ఉన్న తె­లు­గు దేశం పా­ర్టీ గట్టి కస­ర­త్తు చే­స్తే గె­లు­పు సా­ధ్య­మ­ని రా­జ­కీయ వర్గాల అభి­ప్రా­యం. పైగా ఎప్ప­టి­నుం­చో కూ­ట­మి నేతల దృ­ష్టి పు­లి­వెం­దు­ల­పై­నే ఉంది. జె­డ్పీ­టీ­సీ ఎన్ని­క­ల్లో సత్తా చా­టిన టీ­డీ­పీ ఇక పు­లి­వెం­దు­ల­పై ప్ర­త్యేక దృ­ష్టి పె­ట్టే అవ­కా­శం కని­పి­స్తోం­ది. జగన్ ఇప్ప­టి­వ­ర­కు ఆ ప్రాం­తం­లో ఎప్పు­డూ ఓటమి చూ­డ­లే­దు. ప్ర­స్తుత రా­జ­కీయ పరి­స్థి­తు­ల్లో కూ­ట­మి వ్యూ­హా­త్మ­కం­గా వ్య­వ­హ­రి­స్తూ ముం­దు­కె­ళ్తోం­ది. ప్ర­జ­ల్లో­నూ మా­ర్పు సం­కే­తా­లు కని­పి­స్తు­న్నా­య­ని వి­శ్లే­ష­కు­లు అం­టు­న్నా­రు.

Tags:    

Similar News