TTD Darshan: ఫిబ్రవరి 15 తరువాత ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు!
TTD Darshan: కరోనా ప్రభావం తగ్గితే మార్చి మొదటివారంలో శ్రీవారం ఆర్జిత సేవలను పునరుద్దరిస్తామని ఆయన స్పష్టంచేశారు;
TTD Darshan: కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి.. అన్ని అనుకూలిస్తే ఫిబ్రవరి 15వ తేదీ తరువాత శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఆఫ్ లైన్‌లో సామాన్య భక్తులకు కేటాయిస్తామని అన్నారు టీటీడీ ఈవో జవహార్ రెడ్డి. కరోనా ప్రభావం తగ్గితే మార్చి మొదటివారంలో శ్రీవారం ఆర్జిత సేవలను పునరుద్దరిస్తామని ఆయన స్పష్టంచేశారు.
ధర్మారెడ్డిసహా పలువురు సీనియర్ అధికారులతో వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు.బండరాళ్లు విరిగిపడే ప్రమాదాలను ముందే గుర్తించే సాంకేతికతను త్వరలో తీసుకొస్తామన్నారు. శ్రీవారి టికెట్లను విక్రయించే నకిలీ వెబ్ సైట్లను గుర్తించి డియాక్టివ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. హనుమాన్ జన్మస్థలమైన అంజనాద్రిలో ఫిబ్రవరి 16న అభివృద్ది పనులకు భూమి పూజ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.