TTD:  నేడే శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Update: 2025-11-18 03:15 GMT

తి­రు­మ­‌ల శ్రీ­‌­వా­రి ఆర్జిత సేవా టి­కె­ట్ల(సు­ప్ర­భా­తం, తో­మాల, అర్చన, అష్ట­దళ పా­ద­ప­ద్మా­రా­ధన సేవ)కు సం­బం­ధిం­చిన ఫి­బ్ర­వ­రి నెల కో­టా­ను ఇవాళ ఉదయం 10 గం­ట­‌­ల­‌­కు టీ­టీ­డీ ఆన్‌­లై­న్‌­లో వి­డు­దల చే­య­‌­నుం­ది. ఈ మే­ర­కు టీ­టీ­డీ ప్ర­క­టన వి­డు­దల చే­సిం­ది. 2026 ఫి­బ్ర­వ­రి నె­ల­కు సం­బం­ధిం­చి టీ­టీ­డీ వి­డు­దల చేసే వి­విధ దర్శ­నాల, గదుల కోటా వి­వ­రా­ల­ను తె­లి­పిం­ది. ఈ సేవా టి­కె­ట్లు ఎల­క్ట్రా­ని­క్ డిప్ కోసం నవం­బ­ర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌­లై­న్‌­లో నమో­దు చే­సు­కో­వ­చ్చు. ఈ టి­కె­ట్లు పొం­దిన వారు నవం­బ­ర్ 20 నుం­డి 22వ తేదీ మధ్యా­హ్నం 12 గంటల లోపు సొ­మ్ము చె­ల్లిం­చిన వా­రి­కి టి­కె­ట్లు మం­జూ­ర­వు­తా­యి. కల్యా­ణో­త్స­వం, ఊం­జ­ల్ సేవ, ఆర్జిత బ్ర­హ్మో­త్స­వం, సహ­స్ర­దీ­పా­లం­కార సేవ, శ్రీ­వా­రి సా­ల­క­ట్ల తె­ప్పో­త్స­వం టి­కె­ట్ల­ను 21న ఉదయం 10 గం­ట­ల­కు టీ­టీ­డీ ఆన్ లైన్ లో వి­డు­దల చే­య­‌­నుం­ది. వర్చు­వ­ల్ సే­వ­లు, వాటి దర్శన స్లా­ట్ల­కు సం­బం­ధిం­చిన కో­టా­ను 21న మధ్యా­హ్నం 3 గం­ట­ల­కు టీ­టీ­డీ ఆన్‌­లై­న్‌­లో వి­డు­దల చే­య­‌­నుం­ది. అంగ ప్ర­ద­క్షిణ టో­కె­న్ల కో­టా­ను 24న ఉదయం 10 గం­ట­ల­కు వి­డు­దల చే­య­ను­న్నట్లు టీ­టీ­డీ అధి­కా­రు­లు ప్ర­క­టిం­చా­రు.

Tags:    

Similar News