Nitin Gadkari : ఏపీ చరిత్రలో ఇవాళ మరచిపోలేని రోజు : నితిన్ గడ్కరీ
Nitin Gadkari : జాతీయ రహదారుల విస్తరణ వల్ల రవాణా వ్యయం తగ్గి, అభివృద్ధి జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.;
Nitin Gadkari : జాతీయ రహదారుల విస్తరణ వల్ల రవాణా వ్యయం తగ్గి, అభివృద్ధి జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఏపీ చరిత్రలో ఇవాళ మరిచిపోలేని రోజన్న గడ్కరీ.. ఏపీలో వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు కీలకమైనవన్నారు. కాలుష్యం తగ్గించేందకు చర్యలు తీసుకుంటున్నామని.. పెట్రోల్, డీజిల్‌కు బదులుగా సీఎన్‌జీ, ఎల్పీజీ వాహనాలు వాడాలని ఆయన సూచించారు. భవిష్యత్‌లో గ్రీన్ హైడ్రోజన్ వాడకాన్ని ప్రోత్సహిస్తామన్నారు. ఏపీలో 6 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నామన్న గడ్కరీ.. 2024లోగా రాయ్‌పూర్-విశాఖ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పూర్తిచేస్తామన్నారు.