Union Minister : రైతులకు పీఎం కిసాన్ చెక్కులు అందజేసిన కేంద్రమంత్రి పెమ్మసాని

Update: 2025-08-02 11:45 GMT

ఏపీలో 46 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం పెట్టుబడి సాయం అందజేస్తుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. లామ్ ఫాంలో ఏర్పాటు చేసిన పీఎం కిసాన్ సమ్మాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు చెక్కులు అందజేశారు. దేశంలోని రైతులకు ప్రధాని మోడీ పెట్టుబడి సాయం అందించడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు రూ.14 వేలు అదనంగా అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ నిధులను సద్వినియెగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కేంద్రమంత్రి ఆకాంక్షించారు.

కాగా 20వ విడత పీఎం-కిసాన్‌ నిధులను ప్రధాని మోదీ ఇవాళ విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ కింద ఈ నిధులు విడుదల చేశారు. రూ.20వేల కోట్ల నిధులతో 9.7 కోట్ల మంది రైతులకు లాభం చేకూరనుంది.

Tags:    

Similar News