జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఏ స్థాయిలో అరాచకాలు సృష్టించాడో చూసాం. కొందరిని పనిగట్టుకొని టిడిపి, జనసేన నేతలను తిట్టించడం కోసమే పెట్టుకున్నాడు జగన్. వాళ్లతో మనుషులు కూడా మాట్లాడని రేంజ్ లో బూతులు తిట్టించాడు. చంద్రబాబును, నారా భువనేశ్వరి గారిని, లోకేష్, పవన్ కళ్యాణ్ లను అలాగే ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టిస్తూ.. పైశాచిక ఆనందం పొందాడు. జగన్ సీఎంగా ఉన్నన్ని రోజులు వాళ్ల మీద ఎన్ని కేసులు వచ్చినా సరే అరెస్టు కాకుండా కాపాడాడు. వాళ్ల అరాచకాలు చూసి జనం ఛీ కొడితే అధికారం పోయి బెంగళూరు ప్యాలెస్ లో కూర్చున్నాడు. ఇప్పుడు అలా బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయిన వారందరిపై కేసులు నమోదు అవుతూ అరెస్ట్ అవుతుంటే వాళ్లతో సంబంధం లేదంటున్నడు జగన్.
వాళ్లకు తన వైసిపి పార్టీకి అసలు సంబంధం లేదని.. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు అంటున్నాడు. కానీ జగన్ అధికారంలో ఉన్నన్ని రోజులు బోరుగడ్డ అనిల్, శ్రీ రెడ్డి, పోసాని కృష్ణమురళి, ఆర్జీవి లాంటి వాళ్లను తమ పార్టీ నేతలే అని వైసీపీ మీడియాలో రాయించారు కదా. వాళ్ల మీద కేసులు పెడితే.. వైసీపీ నేతల మీద టిడిపి దాడులు అంటూ ఇదే వైసిపి సోషల్ మీడియాలో, వైసిపి ఛానల్ లలో, పేపర్లలో రాయించారు. ఇప్పుడు జనాలు దుమ్మెత్తి పోస్తారు కాబట్టి వాళ్లతో తమ పార్టీకి సంబంధం లేదని.. వాళ్లు ఎవరో కూడా తెలియదు అన్నట్టు కవరింగులు ఇస్తున్నారు. అంటే అవసరం ఉన్నన్ని రోజులు వాడుకొని ఇప్పుడు మాకు పార్టీకి సంబంధం లేదంటారా అని ఇన్ని రోజులు తిట్టిన వాళ్లంతా షాక్ అవుతున్నారు.
జగన్ కోసమే తాము అలా తిట్టామని, వైసిపి అగ్ర నేతలు చెబితేనే అలా ప్రవర్తించామని పోలీసుల ముందు ఒప్పేసుకుంటున్నారు వాళ్లంతా. తాము జగన్ కోసం ఎంత చేస్తే చివరకు తమను సంబంధం లేని వ్యక్తులుగా చూస్తారా అని ఇంటర్వ్యూలోనే ఓపెన్ గా మాట్లాడుతున్నారు. మరి నిజమే కదా. జగన్ కు అవసరం ఉన్నన్ని రోజులు వాడుకొని పక్కన పెట్టేయడం కొత్త ఏం కాదు. జగన్ ఇచ్చే డబ్బుల కోసం రెచ్చిపోయి బూతులు తిడితే ఏమవుతుందో వీళ్లను చూసి అందరూ నేర్చుకోవాలి అంటున్నారు కూటమినేతలు.