కేటీఆర్ మాట్లాడినంత ధైర్యంగా కూడా జగన్ మాట్లాడడం లేదు : వర్ల రామయ్య
విశాఖ ఉక్కుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడినంత ధైర్యంగా కూడా ఏపీ సీఎం జగన్ మాట్లాడడం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు.;
విశాఖ ఉక్కుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడినంత ధైర్యంగా కూడా ఏపీ సీఎం జగన్ మాట్లాడడం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. విశాఖ ఉక్కు పోరాటానికి సంఘీభావం తెలుపుతూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన స్వాగతించారు. పక్క రాష్ట్ర మంత్రిగా ఉన్న కేటీఆర్... పోరాటానికి అనుకూలంగా మాట్లాడితే.. ఏపీ సీఎం మాత్రం లేఖ రాసి కూర్చున్నారని.... ఈ వ్యవహారంలో సీఎం జగన్, విజయసాయి రెడ్డి తోడు దొంగలను వర్ల రామయ్య విమర్శించారు.