Tirupati Floods: తిరుమల గురించి వైరల్ అవుతున్న వీడియోలను నమ్మవద్దు: టీటీడీ
Tirupati Floods: తిరుపతిలో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. అక్కడి ప్రజలు దయనీయమైన స్థితిలో కాలాన్ని నెట్టుకొస్తున్నారు.;
Tirupati Floods (tv5news.in)
Tirupati Floods: తిరుపతిలో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. అక్కడి ప్రజలు చాలా దయనీయమైన స్థితిలో కాలాన్ని నెట్టుకొస్తున్నారు. ఇప్పటివరకు అక్కడి వరదల్లో ఎంతమంది గల్లంతయ్యారో కూడా లెక్కే లేదు. ఇంకా కొంతకాలం పాటు అక్కడ హై ఎలర్ట్ కొనసాగే అవకాశం ఉంది. కానీ తిరుమల వరదల గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోల గురించి నమ్మవద్దని టీటీడీ భరోసా ఇస్తోంది.
వరదల వల్ల తిరుమలలోని రెండో ఘాట్ రోడ్డు పూర్తిగా ధ్వంసం అవ్వడంతో టీటీడీ ఈవో స్వయంగా వాటి మరమ్మత్తులను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఫస్ట్, సెకండ్ ఘాట్స్‌లో పలు చోట్ల వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఫస్ట్ ఘాట్ వద్ద మరమ్మత్తులు ఇటీవల పూర్తవ్వడంతో భక్తుల రాకపోకలకు కాస్త సౌకర్యం కలిగింది. సెకండ్ ఘాట్‌కు మరమ్మత్తులు ఇంకా జరుగుతున్నాయి.
సెకండ్ ఘాట్‌లో మరమ్మత్తులు పూర్తవ్వగానే భక్తులకు ఆ దారిని అందుబాటులోకి తెస్తామని ఈవో అన్నారు. కానీ అంతలోపే తిరుమలలో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయంటూ పలువురు వీడియోలను వైరల్ చేస్తున్నారంటూ అవేవి నమ్మకూడదని ఆయన చెప్పారు. తిరుమలలోనే కాదు తిరుపతిలో భక్తుల భద్రత గురించి కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.