Ainavilli Temple: ఆ ఆలయంలో దేవుడికి పెన్నులతో పూజ.. ఎందుకంటే..?

Ainavilli Temple: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకము, చదువుల పండుగ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి

Update: 2022-02-04 09:00 GMT

Ainavilli Temple (tv5news.in)

Ainavilli Temple: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో సప్తనదీ జలాలతో స్వామివారికి రుద్రాభిషేకము, చదువుల పండుగ మహోత్సవాలు పండితుల వేదఘోషల మధ్య వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా పరీక్షల సీజన్‌కు ముందు అయినవిల్లి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే లక్ష పెన్నుల పూజ, సప్తనదీ జలాభిషేకం పూజలు కోవిడ్‌ నిబంధనలతో సాదాసీదాగా నిర్వహిస్తున్నారు.

గణపతి కల్పం, గరిక పూజ, లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాలతో మూడురోజుల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రేపు మహాన్యాసం, ఏకాదశ రుద్రాభిషేకం, విఘ్నేశ్వర స్వామి పదాల చెంత లక్ష కలములసమర్పణ, సరస్వతీ గాయత్రీ హోమం జరుపుతారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు సప్తనదీ జలాలలో అభిషేకం నిర్వహిస్తారు. ఆదివారం నాడు విద్యార్థులకు లక్ష కలముల వితరణ కార్యక్రమం జరుగుతుంది. గంగ, యమున , సరస్వతి, నర్మద, సింధు, కావేరీ, గోదావరి నదుల నుంచి ప్రత్యేక పూజలు చేసి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తారకేశ్వరరావు తెలిపారు.

Tags:    

Similar News