Vijayasai Reddy : విజయసాయిరెడ్డి ట్వీట్.. బిగ్ బాస్ పని అయిపోయినట్టేనా..?

Update: 2026-01-19 08:15 GMT

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఆయన ఈ నెల 22న లిక్కర్ కేసులో ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. ఆయన గతంలోనే ఈ కేసుపై సంచలన కామెంట్లు చేశారు. తనకు లిక్కర్ కేసు గురించి మొత్త తెలుసని.. అందులో ఎవరెవరు ఉన్నారో.. బిగ్ బాస్ గురించి కూడా బయటపెడుతానంటూ చెప్పారు. ఇప్పుడు తాజాగా చేసిన ట్వీట్ ను బట్టి ఆయన అన్నీ బయటపెట్టబోతున్నట్టు చెప్పకనే చెప్పేశారు. అమ్ముడు పోయిన కోటరీల మధ్య బంధీలుగా ఉన్న నాయకుల్లారా ఒకసారి ఆలోచించుకోండి. వెనెజులాలో బలమైన బందోబస్తు మధ్య ఉన్న నికోలస్ మదురోను అమెరికా ఈజీగా ఎత్తుకుపోయిందంటే కారణం.. చుట్టూ ఉన్న వారు అమ్ముడు పోవడం వల్లే కదా అంటూ చెప్పారు.

విజయసాయిరెడ్డి ట్వీట్ ను బట్టి బిగ్ బాస్ కూడా ఎంత గట్టి సెక్యూరిటీ మధ్య ఉన్నా సరే అరెస్ట్ చేయకతప్పదు అన్నట్టు వ్యాఖ్యలున్నాయి. అమ్ముడు పోయిన కోటరీ అంటే.. ఇప్పుడు జగన్ చుట్టూ ఉన్న కోటరీ గురించే విజయసాయిరెడ్డి మాట్లాడారా అనే కామెంట్లు వస్తున్నాయి. పేర్లు చెప్పకపోయినా.. నేరుగా విజయసాయిరెడ్డి జగన్ నే టార్గెట్ చేశారని కొందరు వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా విజయసాయిరెడ్డి చెప్పిన దాని ప్రకారం.. ఇప్పుడు వైసీపీలో భయాందోళనలు మొదలయ్యాయి.

ఇన్ని రోజులు బయటకు రాని కొందరు నేతల పేర్లు కూడా విచారణలో విజయసాయిరెడ్డి బయటపెట్టే అవకాశం ఉందని వారంతా భయపడుతున్నారు. అలా బయటపెడితే తమ అరెస్ట్ లు కూడా తప్పవనేది వారిలో టెన్షన్ ను పెంచేస్తోంది. మరి నిజంగానే విజయసాయిరెడ్డి వారందరి పేర్లు బయటపెడితే మాత్రం అది ఏపీ రాజకీయాల్లో పెను సంచలనమే అవుతుంది. మొత్తానికి విజయసాయిరెడ్డ ట్వీట్ వైసీపీ గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది.


Full View

Tags:    

Similar News