విజయవాడ దుర్గ గుడిలో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇటీవల భక్తులు మరీ మోడరన్ గా ఉండే డ్రెస్ లతో ఆలయ ప్రవేశం చేయడం.. కొందరు మగవాళ్ళు ఏకంగా షార్ట్ వేసుకుని మరీ గుడిలోకి రావడంపై అనేక విమర్శలు వచ్చాయి. కొంతమంది భక్తులు మొబైల్ ఫోన్ లను లోపలికి తీసుకువెళ్లి అమ్మవారి ఫోటోలు దొంగతనంగా తీయడం ఆలయ ప్రతిష్ట దెబ్బ తినేలా వాటిని అనుచిత రీతిలో సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం వంటివి తీవ్ర విమర్శలు పాలయ్యాయి. దీనితో ఇకపై గుడిలో కఠిన నిబంధనలు అమలులో పెడుతున్నట్టు దుర్గ గుడి ఈవో శీనా నాయక్ తెలిపారు. ఇకపై భక్తులు కచ్చితంగా మొబైల్ భద్రపరచిన తరువాతే ఆలయ దర్శనానికి రావాలని తెలిపారు దుర్గ గుడి ఈవో. ఆలయంలోపలికి సిబ్బందితో సహా ఎవరికి ఫోన్స్ తో ప్రవేశం ఉండదు. అభ్యంతరం లేని దుస్తులు ధరించి మాత్రమే గుడిలోకి రావాలనేది అమలు చేస్తున్నారు.