Vijayawada: థియేటర్ ఓనర్లకు షాక్ ఇచ్చిన మేయర్.. ప్రతి షో కూ వంద టికెట్లు..

Vijayawada: సినిమా థియేటర్ ఓనర్లకు బెజవాడ మేయర్ భాగ్యలక్ష్మి రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది.;

Update: 2022-03-10 16:00 GMT

Vijayawada: సినిమా థియేటర్ ఓనర్లకు బెజవాడ మేయర్ భాగ్యలక్ష‌్మి రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. కొత్త సినిమా విడుదల సందర్భంగా ప్రతి షోకు తనకు వంద టికెట్లు కావాలని లేఖలో పేర్కొన్నారు మేయర్. వంద టికెట్లకు డబ్బులు తాము చెల్లిస్తామని.. టికెట్లు తన ఛాంబర్‌కు పంపాలని ఆదేశించారు. వైసీపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు సినిమా టికెట్లు అడుగుతున్నారని.. అందుకే తనకు టికెట్లు పంపాల్సిందే అని స్పష్టం చేశారు. మేయర్ లేఖతో థియేటర్ ఓనర్లు విస్తుపోయారు.

Tags:    

Similar News