Krishnapatnam Anandayya: ఆనందయ్య ఒమిక్రాన్ మందును వ్యతిరేకిస్తున్న సొంత గ్రామస్తులు
Krishnapatnam Anandayya:;
Krishnapatnam Anandayya: ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్‌కు విరుగుడు తనవద్ద ఉందని ప్రకటించిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్యకు సొంత గ్రామస్తుల నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఒమిక్రాన్ ప్రత్యేకంగా మందు తయారు చేసి పంపిణీ చేయడంతో పాటు ఒమిక్రాన్ సోకకుండా ముందు జాగ్రత్తగా బూస్టర్ మందు కూడా సిద్ధం చేశారు. అయితే ఆనందయ్య ఒమిక్రాన్ మందు పంపిణీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు స్థానికులు.
కరోనా మందుతో ప్రజలకు ఉపశమనం కల్పించిన ఆనందయ్య... ఒమిక్రాన్ రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకునే మందు కూడా తయారు చేశానని ప్రకటించగానే పెద్దసంఖ్యలో కృష్ణపట్నం బాట పట్టారు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు. దీంతో కృష్ణపట్నం గ్రామంలో యుద్ధ వాతావరణం మొదలయ్యింది. గ్రామంలోకి ఇతరులను రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. గ్రామ సభ నిర్వహించి ఆనందయ్య గ్రామంలో మందు పంచడానికి వీలులేదని తీర్మానం చేశారు.
ఆనందయ్య మాత్రం ఒమిక్రాన్‌కు మందు పంచేందుకు తనకు అన్ని అనుమతులు ఉన్నాయని పేర్కొనడంతో... అనుమతులు చూపించాలని అధికారులు, గ్రామస్థులు ఆయనను నిలదీస్తున్నారు. ఆనందయ్య సన్నిహితులు మాత్రం ఇది ప్రభుత్వ కక్ష సాదింపు చర్యగా పేర్కొంటున్నారు.
ఆనందయ్య ఒమిక్రాన్ మందు పంపిణీకి గ్రామస్తులు అడ్డుకట్ట..ఆనందయ్య ఒమిక్రాన్ మందును వ్యతిరేకిస్తున్న సొంత గ్రామస్తులుమరోవైపు కరోనాకు, ఒమిక్రాన్ వేరియంట్‌కు మందు ఇస్తామని తమనెవరూ సంప్రదించలేదని ఒమిక్రాన్ కోసం ప్రభుత్వం ఆయుర్వేద మందుకు అనుమతివ్వలేదని ఆయుష్ శాఖ స్పష్టం చేసింది. కాగా ఆనందయ్య మందు పంపకానికి అనుమతివ్వాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.