Parvathipuram Manyam District: మహిళను తాళ్లతో కట్టేసిన గ్రామస్తులు.. ఎందుకంటే..?
Parvathipuram Manyam District: మన్యం జిల్లా సివిని గ్రామంలో చిట్టీల పేరుతో మోసం చేసిన మహిళను గ్రామస్థులు నిర్బంధించారు.;
Parvathipuram Manyam District: మన్యం జిల్లా సివిని గ్రామంలో చిట్టీల పేరుతో మోసం చేసిన మహిళను గ్రామస్థులు నిర్బంధించారు. రచ్చబండలో తాళ్లతో కట్టేశారు. శోభారాణి అనే మహిళ.. సుమారు వంద మంది నుంచి చిట్టీల పేరుతో కోటీ 40 లక్షల వరకూ వసూలు చేసింది. అయితే గత రెండు నెలలుగా డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినా.. ఇవ్వలేదు. దీంతో ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు నెలల్లో డబ్బు తిరిగి ఇస్తామని చెప్పి.. ఇవ్వకపోవడంతో.. ఆమెను నిర్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని శోభారాణిని విడిపించారు. ఈ క్రమంలో పోలీసులతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు. తమ డబ్బులు వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు.