VISHAKA: "అయోధ్య ఆలయం" సెట్టేసి.. భక్తులను దోచేశారు

విశాఖ తీరంలో భక్తి ముసుగులో దోపిడీ... అయోధ్య ఆలయ సెట్‌ వేసి దోచేశారు... కల్యాణం టికెట్లు రూ.3000కు అమ్మకం... 5 రోజుల్లోనే రూ.5 కోట్ల బిజినెస్..?;

Update: 2025-07-24 05:30 GMT

వి­శా­ఖ­ప­ట్నం బీచ్ రో­డ్డు­లో అయో­ధ్య రా­మా­ల­యం సెట్ వేసి భక్తి ము­సు­గు­లో మో­సా­లు చే­స్తు­న్న వారి గు­ట్టు రట్ట­యిం­ది. దర్శ­నా­లు, కళ్యా­ణో­త్స­వాల పే­రు­తో ప్ర­జల నుం­చి డబ్బు­లు వసూ­లు చే­స్తు­న్న ని­ర్వా­హ­కు­ల­ను వి­శాఖ పో­లీ­సు­లు అరె­స్ట్ చే­శా­రు. భద్రా­చ­లం దే­వ­స్థా­నం నుం­చి పం­డి­తు­లు వస్తా­రం­టూ కళ్యా­ణో­త్స­వం టి­కె­ట్లు భారీ రే­ట్ల­తో వి­క్ర­యిం­చ­డం­తో పో­లీ­సు­ల­కు భద్రా­చ­లం ఆలయ ఈఓ ఫి­ర్యా­దు చే­శా­రు. దీం­తో ఈ వ్య­వ­హా­రం వె­లు­గు­లో­కి వచ్చిం­ది. ఘట­న­పై కేసు నమో­దు చే­సిన పో­లీ­సు­లు దర్యా­ప్తు చే­స్తు­న్నా­రు.

 కల్యాణోత్సవం పేరిట వసూళ్లు

అయో­ధ్య రామ మం­ది­రం సె­ట్‌ వేసి భక్తు­ల­కు రా­ము­ని దర్శ­నం కల్పిం­చా­రు. అం­త­వ­ర­కు బా­గా­నే ఉంది. ఈ నె­లా­ఖ­రు­కు ఈ సె­ట్‌­ను తొ­ల­గిం­చా­ల్సి ఉంది. ఈ నే­ప­థ్యం­లో అయో ధ్య రా­ము­డి కల్యా­ణో­త్స­వా­ని­కి ని­ర్వా­హ­కు­లు సి­ద్ధ­మ­య్యా­రు. దీ­న్ని స్వ­యం­గా భద్రా­చ­లం దే­వ­స్థా­నం పం­డి­తు­ల­చే ని­ర్వ­హిం­చ­ను­న్న­ట్లు ప్ర­చా­రం చే­స్తు­న్నా­రు. ఇం­దు­కో­సం భక్తుల నుం­చి రూ.2,999 చొ­ప్పున వసూ­ళ్లు చే­స్తుం­డ­ట­మే ఆరో­ప­ణ­ల­కు తా­వి­చ్చిం­ది. భద్రా­చ­లం­లో­ని సీ­తా­రా­మ­చం­ద్ర స్వా­మి దే­వ­స్థా­నం పం­డి­తు­లు వచ్చి కల్యా­ణం క్ర­తు­వు ని­ర్వ­హి­స్తా­ర­ని కూడా సో­ష­ల్‌ మీ­డి­యా­లో ప్ర­చా­రం హో­రె­త్తిం­చా­రు. ఈ ప్ర­చా­రం­పై భద్రా­చ­లం ఆలయ అధి­కా­రు­ల­కు తె­లి­సి వి­చా­రణ ని­ర్వ­హిం­చా­రు. అక్క­డి నుం­చి పం­డి­తు­లె­వ­రూ వి­శా­ఖ­ప­ట్నం రా­వ­డం లే­ద­ని తే­లిం­ది. కల్యా­ణో­త్స­వం­పై కనీస సమా­చా­రం కూడా ఇవ్వ­కుం­డా దే­వా­ల­యం పే­రు­ను దు­ర్వి­ని­యో­గం చే­స్తు­న్న­ట్టు గు­ర్తిం­చిన ఆలయ ఎగ్జి­క్యూ­టి­వ్‌ ఆఫీ­స­ర్‌ ఎల్‌.రమా­దే­వి.. వి­శా­ఖ­ప­ట్నం కలె­క్ట­ర్‌­కు, పో­లీ­స్‌ కమి­ష­న­ర్‌­కు, 3వ పట్టణ పో­లీ­స్‌ స్టే­ష­న్‌­కు, దే­వ­దాయ శాఖ అధి­కా­రు­ల­కు ఆది­వా­రం ఫి­ర్యా­దు చే­శా­రు.

Tags:    

Similar News