ఆంధ్రప్రదేశ్‌లో మొదటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు కానుంది. సీఎం చంద్రబాబు నాయుడు అద్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సహక బోర్డు సమావేశంలో ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కె. వామనరావు డైరెక్టర్‌గా ఉన్న బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వైజాగ్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు చేయబోతుందని ఏపీ సర్కార్ వెల్లడించింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.1,250 కోట్లను కేటాయించనుంది. అయితే ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు ప్రభుత్వం ఎంత భూమిని కేటాయించనుంది? ఎంత రేట్‌కు అనే విషయాలు ఇంకా బహిర్గతం కావాల్సి ఉంది.
ఈ కంపెనీ హైదరాబాద్‌తో పాటు వైజాగ్‌లో కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్స్‌ను డెవలప్ చేయబోతున్నట్లు మూడేళ్ల క్రితమే ప్రకటించింది. దేశంలోనే అతి పెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాజెక్ట్‌ను 60 ఎకరాల్లో శంషాబాద్‌లో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింద. వైజాగ్‌లో రుషికొండ హిల్స్‌పై వరల్డ్ ట్రేడ్ సెంటర్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు గతంలో తెలిపారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మాత్రం ఎండాడలో ఈ ప్రాజెక్ట్ రానున్నట్లు వెల్లడించింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ 15వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. విశాఖపట్నంలో సిఫీ ఇన్ఫినిట్ట స్పేసెస్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్నారు.