ఉక్కు కర్మాగారం.. ప్రైవేట్ పరం: కార్మిక సంఘాలు మండిపాటు
లాభనష్టాలతో సంబంధం లేకుండా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం దారుణమని కార్మికులు మండిపడుతున్నారు.;
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ తప్పదంటూ కేంద్రం మరో సారి ప్రకటించడంపై విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. లాభనష్టాలతో సంబంధం లేకుండా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం దారుణమని కార్మికులు మండిపడుతున్నారు. తాము పడ్డ కష్టానికి విలువ లేదా అని ప్రశ్నిస్తున్నారు. కార్మికులకు వివిధ వర్గాల ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ చేస్తోన్న రిలే నిరాహారదీక్ష 33 వ రోజుకు చేరుకుంది.