AP Rain Alert : ఏపీకి మరో రెయిన్ అలర్ట్
AP Weather Alert : ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో ఏపీ తడిసి ముద్దయింది. ఇది చాలదన్నట్టు మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణశాఖ.;
AP Weather Alert : ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో ఏపీ తడిసి ముద్దయింది. ఇది చాలదన్నట్టు మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అండమాన్ దీవుల వద్ద అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని, రేపు ఉదయానికి వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈనెల 4న ఉత్తరాంధ్ర, ఒడిషా మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఎల్లుండి నుంచి ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.