AP: కాకినాడ తీరానికి భారీ సొర చేప..బరువు ఎంతో తెలిస్తే షాకే..!

AP: కాకినాడ తీరానికి భారీ సొర చేప కొట్టుకొచ్చింది. దాదాపు 25 అడుగుల పొడవు, 3 టన్నుల బరువు ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు.

Update: 2022-07-11 09:01 GMT

కాకినాడ తీరానికి భారీ సొర చేప కొట్టుకొచ్చింది. దీన్ని స్థానికంగా బుక్క సొర చేపగా పిలుస్తారు. దాదాపు 25 అడుగుల పొడవున్న ఈ చేప 3 టన్నుల వరకు బరువు ఉంటుందని మత్స్యకారులు చెప్తున్నారు. తుఫాన్ వల్లే ఇది తీరానికి కొట్టుకు వచ్చిందని అంటున్నారు. కాకినాడ రూరల్‌ సూర్యారావుపేటలోని NTR బీచ్‌ వద్దకు భారీ చేప కొట్టుకువచ్చిన విషయం తెలిసి.. దీన్ని చూసేందుకు జనం పెద్ద ఎత్తున వెళ్తున్నారు.

Tags:    

Similar News