YCP : జగన్ ను పట్టించుకోని వైసీపీ నేతలు.. అయ్యో పాపం

Update: 2025-11-04 11:32 GMT

మాజీ సీఎం జగన్ ను ఇటు ఏపీ ప్రజలే కాదు.. అటు వైసీపీ నేతలు కూడా పట్టించుకోవట్లేదు. ఆయన మాట అంటే అసలు లెక్కే లేనట్టు వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నేతలు విఫలం అవుతున్నారంటూ కేడర్ లో తీవ్ర చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ అధిష్టానం చేపడుతున్న కార్యక్రమాలను నిర్వహించడంలో నియోజకవర్గ ఇన్ ఛార్జులు వెనకబడుతున్నారు. ప్రజల వద్దకు వెళ్తున్నా సరే సరిగ్గా పట్టించుకోకపోవడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. మొన్నటికి మొన్న మెడికల్ కాలేజీల విషయంలో కోటి సంతకాల సేకరణకు అధిష్టానం ఆదేశిస్తే.. ఈ జిల్లాలో అసలు రెస్పాన్స్ ఇంత కూడా లేదు.

ఈ మెడికల్ కాలేజీల వ్యవహారంపై వైసీపీ నేతలు ఎలాగైనా కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు రకరకాల తప్పుడు ప్రచారాలు చేశారు. ఇది చాలదన్నట్టు.. కోటి సంతకాల సేకరణ పేరుతో రోజుకు రెండు గ్రామాల చొప్పున 42 రెండు రోజుల పాటు సంతకాలు సేకరించాలని ఆదేశించింది అధిష్టానం. కానీ ఉమ్మడి విజయనగరం జిల్లాలో మాత్రం నేతలే సరిగ్గా పట్టించుకోవట్లేదు. నియోజకవర్గాల ఇన్ చార్జులు అసలు తమకే ఇవన్నీ వద్దు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. తాము వెళ్లినా ప్రజలు పట్టించుకోరని.. కాబట్టి దీన్ని పట్టించుకోకుండా సైలెంట్ గా ఉండిపోతున్నారు. దీంతో వారికి పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కోలగట్ల వీరభద్రస్వామి, కడుబండి శ్రీనివాస రావు, బట్టుకొండ అప్పలనాయుడు, బొచ్చా అప్పల నర్సయ్య, పాముల పుష్ప శ్రీ వాణిలకు నోటీసులు అందాయని తెలుస్తోంది.

పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదని జగన్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఈ నియోజకవర్గాల ఇన్ చార్జులు పార్టీనే పట్టించుకోవట్లేదని కేడర్ ఆరోపిస్తోంది. పార్టీ ఏ కార్యక్రమాలకు పిలుపునిచ్చినా వీరు పట్టించుకోవట్లేదంట. ఎందుకంటే పార్టీ కార్యక్రమాలకు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. ప్రజల వద్దకు వెళ్తే నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. అందుకే అధిష్టానం ఆదేశాలను కాదనలేక.. ప్రజల్లోకి వెళ్లలేక నానా ఇబ్బందులు పడుతున్నారంట ఇన్ చార్జులు. అసలే వైసీపీ హయాంలో చేసిన అరాచకాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. కాబట్టి తాము ప్రజల వద్దకు వెళ్లేందుకు రెడీగా లేమని తేల్చి చెబుతున్నారంట. దీంతో జగన్ మాటకు పార్టీలో కూడా విలువ లేకుండా పోయిందంటున్నారు.


Full View

Tags:    

Similar News