Tirupati Floods: వైసీపీ లీడర్లకు తృటిలో తప్పిన ప్రమాదం.. రాయల చెరువులో..
Tirupati Floods: రాయలచెరువు పరిస్థితి తెలుసుకునేందుకు వెళ్లిన వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రమాదం తప్పింది.;
Tirupati Floods (tv5news.in)
Tirupati Floods: రాయలచెరువు పరిస్థితి తెలుసుకునేందుకు వెళ్లిన వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు తృటిలో ప్రమాదం తప్పింది. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి గౌతంరెడ్డితో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బోటులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న బోటు అదుపుతప్పి చెరువు గట్టును ఢీకొంది. దీంతో బోటులో ఉన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తు అదుపుతప్పిన బోటు స్థిరంగా ఉండడంతో ఊపిరిపీల్చుకున్నారు.