వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఆయన ఏ4గా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నించారు. అయితే, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు నిన్న తీర్పును వెలువరించింది. ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి దేశం విడిచిపోకుండా... ముందస్తు జాగ్రత్తలో భాగంగా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంకేసు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కీలక నిందితుడిగా ఉన్నారు. విదేశాలకు పారిపోకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఆయనపై లుక్ అవుట్ నోటీసుజారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మిథున్ రెడ్డి ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం.