YCP Plenary : వైసీపీ ప్లీనరీ తొలిరోజు 4 తీర్మానాలు

YCP Plenary : వైసీపీ ప్లీనరీ తొలిరోజు 4 తీర్మానాలను ఆమోదించారు

Update: 2022-07-08 15:36 GMT

YCP Plenary : అధికారం అంటే అహంకారం కాదని.. ప్రజలపై మమకారమన్నారు సీఎం జగన్‌. 2019లో ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 151 సీట్లిచ్చి ఆశీర్వదించారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోని ఓ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లా భావించి అమలు చేస్తున్నామన్నారు.

మరోవైపు.. వైసీపీ ప్లీనరీలో తొలిరోజు సమావేశాలు ముగిశాయి. ఉదయం 11 గంటలకు మొదలైన సమావేశాలు.... సాయంత్రం దాకా కొనసాగాయి. పార్టీ అధినేత హోదాలో సీఎం జగన్‌ ప్రారంభోపన్యాసం చేశారు. గౌరవ అధ్యక్షురాలి హోదాలో వైఎస్‌ విజయమ్మ ప్రసంగించారు. అనంతరం. జగన్‌ కేబినెట్‌లోని పలువురు మంత్రులు ఆయా అంశాలపై ప్రసంగించారు.

తొలి రోజు ప్లీనరిలో నాలుగు తీర్మానాలు ప్రవేశపెట్టగా.. వాటి ఆమోదిస్తూ... తీర్మానం చేశారు. మహిళా సాధికారత - దిశ చట్టం, విద్యా రంగంలో సంస్కరణలు, నవరత్నాలు - డీబీటీ, వైద్య ఆరోగ్య రంగం తీర్మానాలను ఆమోదించారు. రేపు రెండో రోజు ప్లీనరిలో.. మరో ఐదు తీర్మానాలపై చర్చ జరగనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.  

Tags:    

Similar News