మాజీ సీఎం వైఎస్ జగన్ తన చెల్లెలు షర్మిలకు వాటాలు ఇచ్చేదే లేదంటున్నాడు. ఆస్తులు మొత్తం తనవే అని.. తాను ప్రేమతో ఇచ్చినవి కూడా వెనక్కి తీసుకుంటాను అని ఇప్పటికే ఎన్నోసార్లు ప్రకటించేశాడు. ఇప్పుడు మరోసారి చెన్నైలోని జాతీయ కంపెనీ అప్పి లేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ ఏ టి) లో పిటిషన్ వేశారు. తన చెల్లెలు షర్మిలకు ప్రేమతో 2019 ఆగస్టు 31న సరస్వతి పవర్ లిమిటెడ్ తో పాటు కొన్ని ఆస్తులలో వాటా ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్టు తెలిపాడు. అయితే ఇప్పుడు షర్మిల తనకు రాజకీయంగా వ్యతిరేకంగా మారింది కాబట్టి వాటిని ఇవ్వడానికి సిద్ధంగా లేనట్లు అందులో వివరించాడు.
సరస్వతి పవర్ లిమిటెడ్ ఆస్తుల జప్తునకు సంబంధించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తెలంగాణ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసిందని ఈ కేసులన్నీ పూర్తయిన తర్వాత ఆస్తుల వాటాలను బదిలీ చేయాలని గతంలో తాను నిర్ణయించుకున్నానని.. దీనిపై అందుకే గతంలో ఒప్పందం కూడా చేసుకున్నట్టు వివరించాడు. ఆ ఆస్తులు మొత్తం తన కష్టార్జితమే అని.. వాటిపై తన చెల్లెలు షర్మిలకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు కూడా లేవని తెలిపాడు. తన తల్లి విజయమ్మ లేఖతో సరస్వతి కంపెనీ బోర్డు ఏకపక్షంగా వాటాలను బదలాయించేలా తీర్మానం చేసిందని.. ఆ తీర్మానాన్ని తాను సవాల్ చేస్తూ ఇప్పటికే హైదరాబాద్ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ లో ఎడిషన్ కూడా వేసినట్లు అందులో మెన్షన్ చేశాడు.
తన పిటిషన్ పై విచారించి కంపెనీ బోర్డు తీర్మానాన్ని రద్దు చేస్తూ వాటాలు క్యాన్సిల్ అయ్యేలా గతంలోనే ట్రైబ్యునల్ ఆదేశించినట్టు గుర్తుచేశాడు. అయితే జగన్ ఇలా తన చెల్లెలకు ఎలాంటి ఆస్తులు రాకుండా చేయడం ఎంతవరకు న్యాయం అంటున్నారు షర్మిల అభిమానులు. చట్టాల గురించి చెప్పే జగన్.. అదే చట్టం ప్రకారం తండ్రి ఆస్తిలో పిల్లలు అందరికీ సమాన హక్కులు ఉంటాయని గుర్తించాలని చెబుతున్నారు. సొంత చెల్లెలికి న్యాయం చేయలేని జగన్ ఏపీ ప్రజలకు ఇంకెలా న్యాయం చేస్తాడని ప్రశ్నిస్తున్నారు కూటమినేతలు.