మరోసారి బరి తెగించారు మాజీ సీఎం జగన్. పట్టపగలే చట్టాలను యధేచ్చగా ఉల్లంగిచ్చేస్తున్నారు. నిన్న దళిత యువకుడి కిడ్నాప్, దాడికి వత్తాసు పలికిన జగన్ ఇవాళ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ గుంటూరు మిర్చియార్డ్‌కు వెళ్లిన జగన్ అడుగడుగునా నిబంధనలు ఉల్లంగించారు. మిర్చియార్డు పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉన్నా,బహిరంగ సభకు వచ్చినట్లు తమ పార్టీ నేతలతో కలసి మిర్చియార్డులో హల్‌చల్ చేశారు, రైతులకు పరామర్శ పేరుతో గుంటూరు మిర్చియార్డులో వైసీపీ అరాచకం సృష్టించింది. సామాన్య ప్రజలు, రైతులు ఎవరూ లేకపోయినా రైతుల వేషంలో మిర్చియార్డులోకి వచ్చిన వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు.
ఇక మీడియా కెమెరాలు, ట్రైప్యాడ్లు పగలగొట్టిన వైసీపీ కార్యకర్తలు.. గుంటూరు మిర్చియార్డ్‌లో వికృత చేష్టలతో భయాందోళనలకు గురిచేశారు. అంతే కాదు అక్కడే ఉన్న జనాలపై జగన్ సెక్యూరిటీ దాడి చేశారు. అసలు రైతులను పరామర్శించకుండా వ్యాపారులను భయాందోళనకు గురిచేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన గుంటూరు మిర్చి యార్డ్ కు చేరిన జగన్ మరోసారి తనకు చట్టాలంటే లెక్కలేదని నిరూపించుకున్నారు.
నిన్న కూడా ప్రభుత్వ నిబందనలను లెక్క చేయకుండా విజయవాడ జైలు వద్ద హడావుడి చేసిన జగన్ సుద్దపూస మాటలు వినిపించారు. వంశీకి సత్యవర్ధన్‌పై దాడికి వంశీకి సంబందం లేదని, టీడీపీ ఫిర్యాదులో ఎక్కడా వంశీ పేరు లేదంటూ ఏయోవో కబుర్లు చెప్పారు. సిగ్గు లేకుండా దళిత యువకుడి కిడ్నాప్, దాడికి జగన్ వత్తాసు పలికారు. అంతే కాదు ఏకంగా పోలీసులపైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు.