మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ తిరుమలకు వెళ్తున్నారు. సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రేణిగుంటకు జగన్ చేరుకుంటారు. రాత్రి ఏడు గంటలకు తిరుమలకు చేరుకుని అక్కడే బస చేస్తారు.
రేపు శనివారం ఉదయం 10.20కి ఆలయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు జగన్. దర్శనం తర్వాత తిరుమల నుంచి బెంగుళూరుకు వెళ్లనున్నారు. అయితే జగన్ తిరుమల పర్యటన తరుణంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. ర్యాలీలు, సభలకు అనుమతి ఇవ్వలేదు. జగన్ తిరుమల రాకపై బీజేపీ నిరసన తెలుపుతోంది. క్రిస్టియన్ అయిన జగన్ తిరుమలకు వెళ్లాలంటే కొండ కిందే దేవుడిపై విశ్వాసం ఉందని పుస్తకంలో సంతకం చేసి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు.