YS Jagan : పిఠాపురంలో వైఎస్ జగన్.. వరద బాధితులతో మాటామంతీ

Update: 2024-09-13 10:30 GMT

YSRCP అధ్యక్షుడు, మాజీ సీఎం, వైఎస్‌ జగన్‌ కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఏలేరు వరదకు అతలాకుతలమైన గ్రామాల్లో జగన్‌ తిరుగుతున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి పిఠాపురం చేరుకున్నారు. అక్కడి నుంచి పాత ఇసుకపల్లి మీదుగా మాధవపురం చేరు­కుని వరద బాధితులతో మాట్లాడారు.

పోటెత్తిన ఏలేరు వరదతో కాకినాడ జిల్లా అతలాకుతలమైంది. ప్రధానంగా మూడు నియోజకవర్గాలపై ఏలేరు విరుచుకుపడి వివిధ వర్గాల ప్రజలు, రైతులను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు ఏలేరు ప్రాజెక్టుకు పోటెత్తుతుందని ప్రభుత్వం ముందస్తు అంచనా వేయలేక పోవడం వల్లే ఈ విపత్తు వచ్చిందని ఇప్పటికే వైసీపీ ఆరోపిస్తోంది.

ఏలేరు వరదతో ఒక సీజన్‌ మొత్తాన్ని కళ్లెదుటే చేజేతులా వదిలేసుకున్నామని ఈ ప్రాంత రైతులు గుండెలు బాదుకుంటున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఏలేరు విధ్వంసానికి జిల్లాలో పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లోని రైతులు ఏకంగా 35 వేల మంది కుదేలైపోయారని చెప్పారు. ఏలేరు వరది తీవ్రత తో 80 వేల ఎకరాల పంటపై ప్రభావం చూపి రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసిందని ఆవేదన వ్యక్తంచేస్తూ.. ప్రభుత్వం ఆదుకోవాలని ప్రతిపక్ష వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News