YS SHARMILA: "జగన్ గారు ఉద్దరించింది శూన్యం"

Update: 2025-09-02 02:00 GMT

మాజీ ము­ఖ్య­మం­త్రి, వై­సీ­పీ అధి­నేత జగ­న్‌­పై ఆం­ధ్ర­ప్ర­దే­శ్ కాం­గ్రె­స్ పా­ర్టీ అధ్య­క్షు­రా­లు వై­ఎ­స్ షర్మిల మరో­సా­రి ఘాటు వ్యా­ఖ్య­లు చే­శా­రు. ‘"అన్న­మ­య్య..ఇక అం­తే­న­య్య". ప్రా­జె­క్ట్ కొ­ట్టు­కు పోయి ఐదే­ళ్లు దా­టి­నా పు­న­ర్: ని­ర్మా­ణా­ని­కి ది­క్కు­లే­దు. 39 మం­ది­ని బలి­గొ­న్న ఘోర వి­ప­త్తు­లో జరి­గిన నష్టా­న్ని పూ­డ్చే మనసు ప్ర­భు­త్వా­ల­కు లేదు. 5 ఊళ్లు కొ­ట్టు­కు­పో­తే పు­న­రా­వా­సా­ని­కి రూ­పా­యి ఇచ్చిం­ది లేదు. సర్వం కో­ల్పో­యిన ని­రా­శ్ర­యు­ల­ను నే­టి­కీ ఆదు­కు­న్న­ది లేదు. గత వై­సీ­పీ, నేడు కూ­ట­మి ప్ర­భు­త్వా­లు కలి­సి అన్న­మ­య్య ప్రా­జె­క్ట్‌­ను "అనాథ ప్రా­జె­క్ట్" కింద మా­ర్చా­రు. గత ము­ఖ్య­మం­త్రి జగన్ రూ.800 కో­ట్ల­తో మర­మ­త్తు­లు అంటూ హడా­వి­డి తప్పా ప్రా­జె­క్ట్‌­ను కట్టిం­ది లేదు. పు­న­రు­ద్ధ­రణ పే­రు­తో మూ­డే­ళ్లు గడి­పా­రే తప్పా.. తట్టె­డు మట్టి వే­య­లే­దు. బా­ధిత కు­టుం­బా­ల­కు ఇం­డ్లు అం­ద­లే­దు. చని­పో­యిన కు­టుం­బా­ల­కు ఉద్యో­గా­లు దక్క­లే­దు. ఇసుక మా­ఫి­యా­తో ప్రా­జె­క్టు­కు గండి పడి­తే అసెం­బ్లీ వే­ది­క­గా హై లె­వె­ల్ కమి­టీ­ల­నీ, దర్యా­ప్తు కొ­న­సా­గి­స్తా­మ­ని కా­ల­యా­పన తప్పా జగన్ గారు ఉద్ధ­రిం­చిం­ది శూ­న్యం." అని షర్మిల తీ­వ్రం­గా వి­మ­ర్శిం­చా­రు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ఏపీలోని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై ఇప్పటికే సీఆర్డీఏ 50 ఎకరాలు కేటాయించింది. ప్రభుత్వ సంస్థగా ఏక్యూసీసీ ఏర్పాటు కానుంది. వివిధ రంగాల్లో పరిశోధనలు, యూనివర్సిటీలు, స్టార్టప్‌లు, పరిశ్రమలు వినియోగించుకునేందుకు వీలుగా క్వాంటం వ్యాలీ సేవలందిస్తుంది. 2 వేల చదరపు అడుగుల్లో 133 క్యూబిట్, 5కె గేట్స్ క్యాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఐబీఎం సంస్థ ముందుకు వచ్చింది. అధునాతన కూలింగ్ వ్యవస్థ, నిరంతర విద్యుత్ సరఫరాను ప్రభుత్వం క్వాంటం వ్యాలీకి అందించనుంది.

Tags:    

Similar News