వైసీపీ నేతల మాటలు ఎంత దారుణంగా ఉంటున్నాయి అంటే.. వాళ్లు ఎంత పాపం చేసినా సరే అదేమంత పెద్ద నేరం కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు. తాము చేసింది తప్పు అని ఒప్పుకోకపోగా.. దాన్ని కవర్ చేసుకోడానికి.. ప్రజల దృష్టిని మళ్లించడానికి కూటమి ప్రభుత్వం మీద బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీవారి లడ్డూల్లో కల్తీ నెయ్యిని కలిపి భక్తులతో తినిపించిన పాపం వైసీపీకే చెందింది. సుప్రీంకోర్టు నియమించిన సిట్ అధికారులే స్వయంగా విచారించి మరీ వైసీపీ హయాంలో నెయ్యిలో కల్తీ జరిగిందని తేల్చారు. అయినా సరే దాన్ని ఒప్పుకోకుండా వైసీపీ నేతలు.. జంతువుల కొవ్వు కలవలేదు కదా అని వితండ వాదనలు చేస్తున్నారు. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదేమో కదా.
వైసీపీ నేతలు చేస్తున్న ఇలాంటి దారుణమైన పనులు చేస్తుంటే హిందూ భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలు వైసీపీ హయాంలో జరిగినవన్నీ హైందవ ధర్మం మీద దాడిలా ఉన్నాయంటున్నారు. భక్తుల భావాలతో వాళ్లకు అస్సలు సంబంధమే లేనట్టు వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో ఇలా మాట్లాడటం ఏంటని మండిపడుతున్నారు భక్తులు.
కల్తీ నెయ్యి అయితే తప్పు కాదన్నట్టు వైసీపీ నేతలు, సాక్షి మీడియాలో కథనాలు రావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హిందువులు. ఎందుకంటే వైసీపీ హయాంలో హిందూ ఆలయాల మీదనే దాడుటు జరగడం, కలియుగ దైవం అయిన శ్రీవారి లడ్డూను ఇలా కల్తీ చేయడం ఇవన్నీ కూడా హిందువుల మనో భావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి దారుణాలు వైసీపీ నేతలు చేసినా సరే మళ్లీ కవరింగులు ఇచ్చుకోవడం ఏంటని తీవ్రంగా మండిపడుతున్నారు శ్రీవారి భక్తులు.