అందరూ చెప్పేది ఒకలా ఉంటే.. వైసీపీ మీడియా చెప్పేది మాత్రం ఇంకోలా ఉంటోంది. ఇది వినే వారికి కూడా విచిత్రంగా అనిపిస్తోందంటే వాళ్ల రాతలు ఎంత దారుణంగా ఉంటున్నాయో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అయితే కల్తీనెయ్యిపై హిందూ భక్తులు మొత్తం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే వైసీపీ మాత్రం అబ్బే అదేం తప్పు కాదు మీకు దాని గురించి తెలియదు అన్నట్టు వెకిలి రాతలు రాస్తోంది. సుప్రీంకోర్టు నియమించిన సిట్ స్వయంగా విచారణ జరిపి ఒక్క చుక్క పాలు, వెన్న లేకుండానే పామాయిల్, కెమికల్స్ తో నెయ్యి తయారు చేశారని.. వైసీపీ హయాంలో తిరుమలకు 68 లక్షల కిలోలకు పైగా కల్తీ నెయ్యిని బోలేబాబా డెయిరీ సరఫరా చేసిందని తేల్చారు అధికారులు. ఇంత దారుణమైన పని చేసినా సరే వైసీపీ దాన్ని కవరింగ్ చేసుకోడానికే ప్రయత్నించడం విడ్డూరంగా అనిపిస్తోంది.
సాక్షి మీడియాలో పామాయిల్, కెమికల్స్ తో నెయ్యి తయారు చేయడం తప్పేం కాదన్నట్టు ఓ కథ అల్లేశారు. పాలు, వెన్న లేకపోయినా పామాయిల్, కెమికల్స్ తో నెయ్యిని తయారు చేయొచ్చని.. అదేమంత చెడ్డది కాదన్నట్టు సాక్షి ఛానెల్ లో ఓ వీడియోను కూడా ప్రసారం చేయడం మరీ దారుణం అనే చెప్పాలి. సిట్ అధికారులే అది కల్తీ నెయ్యి అని తేల్చిన తర్వాత.. సాక్షి మీడియా దాన్ని మంచి నెయ్యి అంటూ ప్రచారం చేయడం అంటే ఏమనాలి.
కనీసం ప్రజలు నవ్వుతారు అనే ధ్యాస కూడా లేకుండా ఇలాంటి కథనాలు వల్లిస్తే ఎలా అంటున్నారు హిందూ భక్తులు. శ్రీవారు అంటే కనీసం భయం, భక్తి లేకుండా ఇలాంటి కథనాలు రాస్తారా అంటూ మండిపడుతున్నారు. హిందువుల మనోభావాలు అంటే సాక్షి మీడియాకు కనీసం లెక్కలేదా అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి రాతలు, ఫేక్ వీడియోలతో భక్తుల భావాలతో ఆటలాడితే పరిణామాలు దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు నెటిజన్లు.