Andhra Pradesh : వైసిపి చీప్ ట్రిక్స్ కు బ్రేక్ వేస్తున్న కూటమి..

Update: 2026-01-22 13:08 GMT

వైసిపి నేతల పరిస్థితి ఎలా తయారయింది అంటే.. అభివృద్ధి చేయడం ఎలాగో చేతకాదు కాబట్టి తప్పుడు ప్రచారాలతోనే నెట్టుకు రావాలని చూస్తున్నారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాల కుట్రాలకు తెరలేపిందో చూశాం. ఆ అక్రమాలు భరించలేక ప్రజలు దారుణంగా ఓడగోడితే.. ఇప్పుడు ఫేక్ ప్రచారాలతో కూటమి మీద బురద జల్లడమే ప్రధాన పనిగా పెట్టుకున్నారు వైసిపి బ్యాచ్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని జిల్లాల్లో భూకబ్జాలు చేశారు. ప్రతి స్కీంలో స్కాన్ చేశారు. చివరకు తిరుపతి దేవస్థానాన్ని కూడా వదలకుండా వందల కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ప్రతి చిన్న విషయంలో తప్పుడు ప్రచారాలు చేసే ప్రజల్లో అపోహ సృష్టించాలని చూస్తున్నారు. అయితే వాళ్ల తప్పుడు ప్రచారాలకు కూటమి ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ తో చెక్ పెడుతోంది.

వైసిపి ఏ చిన్న తప్పుడు ప్రచారం చేసినా సరే వెంటనే ఫ్యాక్ట్ చెక్ అంటూ ప్రజలకు అసలు నిజాలను చెబుతోంది. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసింది టిడిపి నేతలే అంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తే.. సీసీ ఫుటేజ్ బయటపెట్టి వాళ్ళ అరాచకాలను బయటపెట్టింది కూటమి ప్రభుత్వం. మొన్నటికి మొన్న తిరుమల కొండమీద మద్యం బాటిల్స్ అంటూ వైసీపీ తప్పుడు ప్రచారానికి తరలిపోయింది. కానీ అసలు మద్యం బాటిల్స్ వేసిందే భూమన అనుచరులు అని కూటమి ప్రభుత్వం బయట పెట్టడంతో వైసిపి నోరు మూసుకుంది. ఇలా ప్రతి విషయంలో కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒకరకంగా తప్పుడు ప్రచారం చేయడమే వైసీపీ బ్యాచ్ పనిగా పెట్టుకుంది.

ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టు కడితే ముందు దాన్ని వ్యతిరేకించడం వైసిపి వంతు. ప్రభుత్వం నానా కష్టాలు పడి దాన్ని పూర్తిచేస్తే ఆ క్రెడిట్ మాదే అంటూ డబ్బు కొట్టుకోవడం జగన్ అండ్ బ్యాచ్ కు అలవాటు అయిపోయింది. ఇలాంటి విషయాల్లో కూడా అసలు ప్రాజెక్టు ఎవరి హయాంలో మొదలైంది ఎలా మొదలైంది దాన్ని పూర్తి చేసింది ఎవరు అనే విషయాలను ప్రజలకు కూలంకుషంగా వివరిస్తూ అసలు నిజాలను చెబుతూ వైసిపి కుట్రలను ఎండగడుతోంది కూటమి ప్రభుత్వం.

Tags:    

Similar News