YSRCP : గూగుల్ డేటా సెంటర్ నుంచి.. గ్రీన్ కో దాకా.. జగన్ క్రెడిట్ చోరీ..

Update: 2026-01-21 04:55 GMT

ఏపీలో వైసీపీ దారుణాలు ఏపీలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎంతలా అంటే.. కూటమి ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టు మొదలు పెడితే.. దాని వల్ల ఎలాంటి లాభం లేదు.. కూటమి అవినీతికి తప్ప అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తారు. నానా కష్టాలు పడి కూటమి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే వచ్చి.. మేమే దాన్ని తెచ్చాం. అది మా హయాంలోనే జరిగింది అంటూ వైసీపీ క్రెడిట్ కొట్టేయడానికి రెడీ అయిపోతోంది. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ లో మొదట్లో తప్పుడు ప్రచారం చేశారు. ఆ డేటా సెంటర్ వల్ల ఒక్క వాచ్ మెన్ ఉద్యోగం తప్ప ఇంకేమీ రాదన్నారు. తర్వాత దేశమంతా పొగిడేసరికి.. అది మా వల్లే వచ్చిందంటూ జగన్ అడ్డంగా ప్లేట్ ఫిరాయించి తన నిజస్వరూపాన్ని బయట పెట్టారు. ఆ తర్వాత భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలోనూ ఇలాగే వ్యవహరించారు. ఇప్పుడు గ్రీన్ కో కంపెనీ మీద పడ్డారు.

వాస్తవానికి 2022లో కేంద్ర ప్రభుత్వంతో గ్రీన్ కో కంపెనీ వాళ్లు అవగాహన కుదుర్చుకున్నారు. కానీ అది ఒప్పందం కూడా కాదు. ఏపీలో పెట్టుబడి పెట్టాలని ఆ కంపెనీ చూసింది. కానీ జగన్ ఈ గ్రీన్ కోతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. ఈ గ్రీన్ కో ఏపీకి రావొద్దంటూ కోర్టుకు ఈడ్చిన ఘనత జగన్ కే దక్కింది. అంత పెద్ద కంపెనీ ఏపీకి రాకుండా అడ్డుకున్న జగన్.. చాలా రకాల బెదిరింపులకు పాల్పడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ కంపెనీ ఏపీకి రావడానికి ఓకే చెప్పింది. 83వేల కోట్ల పెట్టుబడులు గ్రీన్ కో కంపెనీ పెట్టింది. కాకినాడలో ఏర్పాటైన గ్రీన్ అమ్మోనియా కంపెనీతో 8వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి.

మొన్ననే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ దీనికి శంకుస్థాపన చేశారు. దీంతో మళ్లీ జగన్ అండ్ బ్యాచ్ ఎంట్రీ ఇచ్చింది. గ్రీన్ కో కంపెనీని తామే తెచ్చామంటూ డబ్బా కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. వీళ్ల తీరు చూసి ఏపీ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ముందు ఒక మాట.. తర్వాత ఇంకో మాట వైసీపీ తీరులో కనిపించడంతో.. ఇంత డబ్బా రాయుళ్లను, మాటలు మార్చేసే వాళ్లను ఎక్కడా చూడలేదని ఏపీ ప్రజలు చెబుతున్నారు.

Tags:    

Similar News