Yuvagalam : ఆటో కొనిచ్చిన నారా లోకేష్

మంత్రి రోజాకు చీర, గాజులు ఇవ్వడానికి వెళ్లేందుకు బాషా తన ఆటో ఎక్కించుకు వెళ్లాడు. దీంతో బాషా ఆటోను పోలీసులు సీజ్ చేశారు;

Update: 2023-02-24 10:17 GMT

తిరుపతి నియోజకవర్గం నగరికి చెందిన ఆటో డ్రైవర్ హమీద్ బాషాకి కొత్త ఆటో కొనిచ్చారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. ఇటీవల మంత్రి రోజాకు చీర, గాజులు ఇవ్వడానికి వెళ్లేందుకు తెలుగు మహిళలను హమీద్ బాషా తన ఆటో ఎక్కించుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో హమీద్ బాషా ఆటోను పోలీసులు సీజ్ చేశారు. 

తన జీవనోపాధి కోల్పోయానని హమీద్ బాషా యువగళం పాదయాత్రలో ఉన్న లోకేష్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. చలించిపోయిన లోకేష్‌ కొత్త ఆటో కొనివ్వడంతో బాషాతో పాటు కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లాలో యువగళం దిగ్విజయంగా కొనసాగుతుంది. లోకేష్ వెంట వేలాది మంది కదులుతున్నారు.  ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యువనేత ముందుకు సాగుతున్నారు.  

Tags:    

Similar News