Tirupati Laddu : సీఎంకు వైవీ సుబ్బారెడ్డి సవాల్.. రమణ దీక్షితులు ఎంట్రీ
తిరుమల లడ్డూ వివాదంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. శ్రీవారి చెంత ప్రమాణానికి రావాలని సీఎంకు మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. అయితే లడ్డూ వివాదంపై ఇంతవరకు టీటీడీ ఉన్నతాధికారులు మాత్రం ఎందుకు స్పందించలేదు అంటూ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. తాజాగా టీడీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు మీడియా ముందుకు వచ్చారు. దీంతో ఆయన ఏం చెప్తారన్నదానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. రమణదీక్షితులు ఏం చెబుతారోనని రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.