మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ చాలా అందమైన అబద్ధాలు చెప్పేశారు. జగన్ ను మించిపోయేలా ఆయన కవరింగులు కనిపించాయి. ఓవైపు తిరుమల లడ్డులో నెయ్యి కల్తీ జరిగిందని స్వయంగా సిబిఐ ఏర్పాటు చేసిన సిటీ తేల్చినా సరే.. అడ్డంగా అబద్ధాలు ఆడేస్తున్నారు. నిన్న ఆయన మాట్లాడుతూ.. సిట్ నివేదికలో నెయ్యి కల్తీ జరిగినట్టు తేలలేదని.. జంతువుల కొవ్వు ఉన్నట్టు కూడా రాలేదని ఇదంతా వెంకటేశ్వర స్వామి వారి దయతోనే జరిగినట్టు చెప్పారు. పైగా చిన్న అప్పన్న 2018లోనే తన వద్ద మానేశాడని.. ఆ తర్వాత ఎవరి దగ్గర చేశాడో ఏం చేశాడో తనకు తెలియదంటూ కవరింగులు ఇచ్చేశారు. కానీ ఇక్కడ వైవి సుబ్బారెడ్డి ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి.
వైవి సుబ్బారెడ్డి చెప్పినట్టు సిట్ నివేదికలో కల్తీ జరగనట్టు ఇవ్వలేదు. చాలా డేంజరస్ కెమికల్ తో నెయ్యిని తయారుచేసి.. ఒక్క చుక్క పాలు, వెన్న లేకుండానే నెయ్యిని తయారు చేసి లడ్డుల్లో కలిపేశారని సిట్ స్వయంగా తేల్చింది. ఆ కెమికల్ చాలా డేంజరస్ అని.. అది తింటే భక్తుల ఆరోగ్యానికి చాలా ప్రమాదం అంటూ కూడా తెలిపింది. చిన్న అప్పన్న వైవి సుబ్బారెడ్డి అండతోనే బోలెబాబా డెయిరీకి కాంట్రాక్టులు అప్పగించాడని.. అందుకోసం కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకున్నాడని సిట్ తేల్చింది. ఆ ముడుపులు ఎక్కడికి వెళ్లాయో త్వరలోనే విచారణ కమిటీ ద్వారా ఏపీ ప్రభుత్వం తేల్చాలని డిసైడ్ అయింది. ఇక్కడ చిన్న అప్పన్న లెటర్ హెడ్ లో వైవీ సుబ్బారెడ్డి నెంబర్ ఉంది. చిన్న అప్పన్న వాడుతున్న మొబైల్ నెంబర్ కూడా వైవి సుబ్బారెడ్డిదే.
ఇలా అన్ని విషయాల్లో అడ్డంగా దొరికినా సరే వాటన్నిటినీ తప్పు అని వైవి సుబ్బారెడ్డి చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శనం అని అంటున్నారు కూటమినేతలు. నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి. కండ్ల ముందు ఎన్ని సాక్షాలు కనిపిస్తున్నా సరే జనాలను నమ్మించాలని వైవి సుబ్బారెడ్డి చేస్తున్న ప్రయత్నాలు నిజంగా ఎంత దారుణం అసలు. అంటే సిట్ అధికారులు చెప్పింది కూడా అబద్ధమే అంటారా. కోర్టులు తేల్చింది కూడా అసత్యమే అని ప్రచారం చేస్తారా. నేషనల్ మీడియా కూడా తప్పుగానే ప్రచారం చేస్తుందా.. అసలు వైసీపీ నేతలు ఇంత దారుణంగా అబద్ధాలు ఎలా ఆడుతున్నారు అని ఏపీ ప్రజలు కూడా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.