ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ
రేపు ఉదయం 8 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది.;
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం సందడి మిన్నంటింది. మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు... బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేప ప్రసాద పంపిణీని ప్రారంభించారు. దేశం నలుమూలల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు..ఆస్తమా బాధితులు తరలి వచ్చారు. రేపు ఉదయం 8 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది. కరోనా కారణంగా మూడేళ్ల పాటు చేప ప్రసాద పంపిణీ జరగలేదు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసరాల్లో ఇవాళ, రేపు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు వచ్చే వారి కోసం అదనంగా ఆర్టీసీ బస్‌లు, మెట్రో రైలు సర్వీసులు వేశారు. వృద్ధులకు, పిల్లలకు, వికలాంగులకు ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు చేశారు.