Sonu Sood : పాతిక వేల కేజీల బియ్యం, ఎకరా పొలం... సోనూపై ఎడతెగని అభిమానం...
మంచి మనసున్న హీరోగా పేరుగాంచిన సోనూసూద్ తన మన బేధం లేకుండా ఎక్కడ తన అవసరం ఉందో తెలుసుకుని అక్కడ వాలిపోతుంటాడు. కష్టం, కన్నీళ్లు తెలిసిన మనిషిగా ఎదుటివారికి ఆపద వస్తే చలిచిపోతాడు. అందుకే సూపర్ స్టార్లకు మించిన అభిమానం సంపాదించుకున్నాడు. అభిమానుల మనసుల్లో శాశ్వత స్థానం కైవసం చేసుకున్నాడు. తాజాగా మధ్యప్రదేశ్ లో కొందరు ఫ్యాన్స్ సోనూ సూద్ పట్ల అభిమానాన్ని తమదైన శైలిలో చాటుకున్నారు. ఎకరా విస్తీర్ణంలోని ఓ మైదానంలో 2500కేజీల బియ్యం ఉపయోగించి సోనూ సూద్ ముఖచిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ వీడియోను ట్వీట్ చేసిన సోనూ మాటలకు అందని ఆనందాన్ని అనుభూతి చెందుతున్నట్లు పేర్కొన్నాడు.