బాలీవుడ్ స్టార్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకుల రూమర్స్ కి పూర్తి స్థాయిలో చెక్ పడింది. కొంత కాలంగా వీరిద్దరూ విడిపోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి విడిగా ఉంటోందని.. అభిషేక్ మాత్రం తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను అమితాబ్ బచ్చన్ కొట్టిపారేశారు. మరోవైపు అభిషేక్ కూడా తన వెడ్డింగ్ రింగ్ చూపిస్తూ తాము ఇప్పటికీ కలిసే ఉన్నామని తెలిపాడు. తాజాగా ముంబై ధీరూభాయ్ అంబానీ స్కూల్ లో ఆరాధ్య చదువుతుండగా.. స్కూల్ ఫంక్షన్ కి ఐశ్వర్య, అభిషేక్ జంటగా హాజరయ్యారు. వీరితో పాటు అమితాబ్ బచ్చన్ కూడా రాగా.. ముగ్గురు సరదాగా గడిపారు. దీంతో కొంతకాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టు వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్టైంది. ఈ ఫంక్షన్‌లో ఐశ్వర్య మరియు అభిషేక్ ఆరాధ్య ఇచ్చే ప్రదర్శనను రికార్డ్ చేస్తూ కనిపించారు. అంతేకాకుండా అభిషేక్ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేశారు. దీంతో అభిషేక్, ఐశ్వర్యల విడాకులు పుకార్లు తుడుచుకుపోయాయి