బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' తో ఈ నెల 20న థియేటర్లో సందడి చేయనున్నాడు. అయితే ఆ సినిమా ‘చాంపియన్స్' రీమేక్ అని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై స్పందించాడు ఆమిర్ ఖాన్. తాను రీమేక్లనే నమ్ముతానని, తన జీవితాంతం రీమేక్ చేస్తానని స్పష్టత ఇచ్చాడు. సినిమా తీయడం తన ఇష్టమన్న నటుడు... వాటిని చూడటం మాత్రం ప్రేక్షకుడి ఇష్టమని చెప్పాడు. 'నేను 10కి పైగా రీమేక్ సినిమాలు తీశాను. అందులో 'లాల్సింగ్ చద్దా' తప్ప అన్నీ సూపర్ హిట్ సినిమాలే. సినిమా బాగుంటే ట్రోలింగ్ పని చేయదు. ప్రేక్షకుల భావాలను మాత్రమే పరి గణనలోకి తీసుకుంటాను' అని అన్నాడు. డిజిటల్ హక్కు లను ఓటీటీలకి అమ్మకుండా థియేటర్ తర్వాత నేరుగా ఈ సినిమాని యూట్యూబ్లో పే పర్ వ్యూ ద్వారా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆమిర్. సినిమా విడుదల తర్వాత ఏం జరుగుతుందో తనకు కచ్చితంగా తెలియదన్న ఆయన... ప్రేక్షకులు తన సినిమాలను ఆదరించడం వల్లే ఈ స్థాయిలో ఉన్నట్లు మాత్రం వెల్లడించాడు.