Aamir Khan: తమ సినిమా తామే చూసుకొని ఏడ్చేసిన హీరో.. నిద్రపోయిన హీరోయిన్..
Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లాల్ సింగ్ చడ్డా’.;
Aamir Khan: సినిమాల్లో హీరోహీరోయిన్లు ఒదిగిపోయిన తీరు.. ఒక్కొక్కసారి ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తుంది. సినిమాలోని పాత్రతో ఎక్కువగా కలిసినప్పుడు హీరోహీరోయిన్లు కూడా ఎమోషనల్ అవుతుంటారు. తాజాగా ఓ హీరో.. తన మూవీ స్క్రీనింగ్‌లో ఎమోషనల్ అయ్యాడు. కానీ ఇక్కడ హైలెట్ ఏంటంటే హీరోయిన్ మాత్రం నిద్రపోతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ 'లాల్ సింగ్ చడ్డా'. ఈ సినిమాలో అమీర్‌కు జోడీగా కరీనా నటించింది. ఆగస్ట్ 11న ఈ సినిమా విడుదలను ఖరారు చేసుకోవడంతో ఇప్పటినుండే మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది. ఇప్పటికే తెలుగులో పలువురు ప్రముఖులకు సినిమాను చూపించాడు అమీర్. ఇక హిందీలో కూడా పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలను ఏర్పాటు చేశారు.
హాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ అయిన 'ఫారెస్ట్ గంప్' చిత్రానికి లాల్ సింగ్ చడ్డా రీమేక్‌గా తెరకెక్కింది. అయితే ఈ మూవీ ప్రీమియర్లకు అమీర్ ఖాన్‌తో పాటు తన మాజీ భార్య కిరణ్ రావు, హీరోయిన్ కరీనా కపూర్ హాజరయ్యారు. ఆ సమయంలో అమీర్ ఖాన్ ఎమోషనల్ అవుతుండగా.. కరీనా మాత్రం నిద్రపోతోంది. అక్కడే ఉన్న ఒకరు దీనిని ఫోటో తీసి పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
aamir khan crying watching laal singh chaddha as if he didn't watch the original forrest gump pic.twitter.com/8iqt2BlLbR
— Saharsh (@whysaharsh) July 21, 2022