Romantic Twitter Review : రొమాంటిక్ ట్విట్టర్ రివ్యూ : ఎలా ఉందంటే.. ?
Romantic Twitter Review : టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయ్యేందుకు బాగానే కష్టపడుతున్నాడు.;
Romantic Twitter Review : టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయ్యేందుకు బాగానే కష్టపడుతున్నాడు. తాజాగా ఆకాశ్ పూరి, కేతిక శర్మ మైన లీడ్‌లో వచ్చిన చిత్రం 'రొమాంటిక్'.. నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు. టీజర్, ట్రైలర్ లతో పాటుగా స్టార్ డైరెక్టర్‌ల అందరితో ప్రమోషన్స్ గట్టిగానే చేయించారు పూరీ . ఇక ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో సినిమాని చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.