Alia Bhatt: సినిమా షూటింగ్‌లో ఆలియా భట్.. బేబీ బంప్ ఫోటోలు లీక్..
Alia Bhatt: బాలీవుడ్‌లో క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు రణబీర్ కపూర్, ఆలియా భట్.;
Alia Bhatt: సినీ పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ లైఫ్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలోనే వచ్చిన అవకాశాలను వినియోగించుకొని గుర్తింపు తెచ్చుకోవాలి అనుకుంటారు భామలు. అలా హీరోయిన్‌గా పరిచయమయిన అతి తక్కువ సమయంలోనే ఎంతో పాపులర్ అయ్యింది ఆలియా భట్. ప్రస్తుతం హాలీవుడ్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న ఆలియా.. బేబీ బంప్ ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్‌లో క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు రణబీర్ కపూర్, ఆలియా భట్. వీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటి నుండే వీరికి బాలీవుడ్ ప్రేక్షకులు ఫ్యాన్స్ అయిపోయారు. చాలాకాలం రిలేషన్‌లో ఉన్న తర్వాత ఇటీవల వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి అవ్వగానే పిల్లల గురించి ప్లాన్ చేయాలనుకున్న రణబీర్, ఆలియా.. తాజాగా వారి మొదటి బేబీని ఆహ్వానించబోతున్న విషయాన్ని కూడా బయటపెట్టారు.
ఆలియా భట్ ప్రెగ్నెంట్ అయినా కూడా తనకు ఉన్న పలు సినిమా కమిట్‌మెంట్స్ వల్ల షూటింగ్స్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం తాను 'హార్ట్ ఆఫ్ స్టోన్' అనే హాలీవుడ్ మూవీలో నటిస్తుండగా.. ఆ షూటింగ్ లొకేషన్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఇందులో ఆలియా బేబీ బంప్‌తో కనిపిస్తోంది. ప్రెగ్నెంట్ అయినా కూడా యాక్షన్ సీన్స్‌లో నటిస్తున్నందుకు ఆలియాను అభిమానులు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
Alia bhatt on sets 'Heart of Stone'! with
— hourly ranlia (@goldencranlia) July 8, 2022
gal gadot in Bordeira Portugal yesterday 🌪 pic.twitter.com/CCfDmhnPaH