Alia Bhatt: రణబీర్ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్స్‌పై ఆలియా భట్ షాకింగ్ రియాక్షన్..
Alia Bhatt: కాఫీ విత్ కరణ్ షోలో ఆలియా.. ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది.;
Alia Bhatt: ఆలియా భట్, రణబీర్ కపూర్.. వీరిద్దరు ప్రస్తుతం బాలీవుడ్‌లోని క్యూట్ కపుల్స్‌లో ఒకరు అయ్యారు. గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరూ ఏప్రిల్‌లో పెళ్లితో ఒకటయ్యారు. ఇక త్వరలోనే వారి మొదటి బిడ్డకు వారి జీవితాల్లోకి ఆహ్మానించనున్నారు. ప్రెగ్నెన్సీ గురించి అనౌన్స్ చేసిన తర్వాత మొదటిసారి ఆలియా భట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
'కాఫీ విత్ కరణ్' షో మళ్లీ ప్రారంభమయ్యింది. ఇప్పటికి ఆరు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న తర్వాత ఏడవ సీజన్‌ను.. జులై 7న ప్రారంభించాడు కరణ్ జోహార్. ఈ సీజన్‌లో మొదటి ఎపిసోడ్‌కు గెస్ట్‌లుగా రణవీర్ సింగ్, ఆలియా భట్ వచ్చారు. వీరిద్దరు ఇప్పటికే 'గల్లీ బాయ్' అనే చిత్రంలో కలిసి నటించారు. త్వరలోనే కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్‌కథ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
కాఫీ విత్ కరణ్ షోలో ఆలియా.. ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇక ర్యాపిక్ ఫైర్ రౌండ్‌లో కరణ్.. 'నీ ఎక్స్‌తో ఫ్రెండ్‌గా ఉండడం కష్టమా, రణబీర్ ఎక్స్‌తో ఫ్రెండ్‌గా ఉండడం కష్టమా' అని ఆలియాను అడిగాడు. 'నాకు రణబీర్ ఎక్స్‌తో ఎలా ఫ్రెండ్‌గా ఉండాలో తెలుసు. నాకు వాళ్లిద్దరూ అంటే చాలా ఇష్టం.' అని ఆలియా చెప్పుకొచ్చింది. తను పేర్లు చెప్పకపోయినా.. వారిద్దరూ అంటే కత్రినా కైఫ్, దీపికా పదుకొనె అని ప్రేక్షకులకు తెలుసు.