Swara Bhasker : తాలిబన్లపై పోస్ట్.. నటిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్..!
ఆఫ్గనిస్తాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న వారి అక్రమాల పైన బాలీవుడ్ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఆఫ్గనిస్తాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న వారి అక్రమాల పైన బాలీవుడ్ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే స్వరా భాస్కర్ తాలిబన్ల దాడులపైన చేసిన ఓ ట్వీట్ .. నెటిజన్లను ఆగ్రహనికి గురి చేసింది. తన ట్వీట్లో స్వరా ''హిందూత్వ టెర్రరిజం'' అనే పదాన్ని వాడారు. దీనితో నెటిజన్లు ఆమె పైన ఫైర్ అవుతున్నారు.
''హిందూత్వ ఉగ్రవాదాన్ని మేం అంగీకరించలేము.. అలానే తాలిబన్ల ఉగ్రవాదాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. తాలిబన్ భీభత్సం ప్రతి ఒక్కరిని షాక్‌కు గురి చేసింది. అయితే అక్కడితోనే ఆగిపోకండి.. హిందూత్వ ఉగ్రవాదం గురించి అందరూ ఆగ్రహం వ్యక్తం చేయండి. మన మానవతా, నైతిక విలువలు అణచివేత, అణచివేతకు గురైన వారి గుర్తింపుపై ఆధారపడి ఉండకూడదు'' అంటూ స్వరా భాస్కర్ ట్వీట్ చేశారు.
అయితే ఈ ట్వీట్ తో నటి స్వరా భాస్కర్ తమ మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ ఆమె ట్విటర్ అకౌంట్‌ని సస్పెండ్ చేసి ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు నెటిజన్లు. స్వరా భాస్కర్‌ను అరెస్ట్ చేయండి అనే హాష్‌ట్యాగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. కాగా సోషల్ మీడియాలో నటి ట్రోలింగ్‌కు గురికావడం ఇదే మొదటిసారి కాదు.