Atal: భారత్ మాజీ ప్రధాని జీవితంపై సినిమా.. ఫస్ట్ లుక్ రిలీజ్..
Atal: ఇప్పటికీ ఎన్నో భాషల్లో ఎంతోమంది గొప్ప వ్యక్తుల బయోపిక్స్ తెరకెక్కాయి.;
Atal: సినీ పరిశ్రమలో బయోపిక్‌లకు చాలా క్రేజ్ ఉంది. మనకు తెలిసిన వ్యక్తుల జీవితాలలో.. మనకు తెలియని కథలు చూపించడం కోసం మేకర్స్ చాలా కష్టపడతారు. తెలిసిన వారి కథలు కావడంతో ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలను ఎక్కువగా ఆదరిస్తారు. ఇప్పటికీ ఎన్నో భాషల్లో ఎంతోమంది గొప్ప వ్యక్తుల బయోపిక్స్ తెరకెక్కాయి. తాజాగా భారత్ మాజీ ప్రధానిపై తెరకెక్కుతున్న చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
దివంగత భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి.. దేశానికి చేసిన సేవలను మరవలేనివి. అందుకే ఆయన జీవితంపై ఓ సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించింది బాలీవుడ్. ఇటీవల ఆ మూవీ ఫస్ట్ లుక్ కూడా విడుదలయ్యి ఆకట్టుకుంటోంది. ఇప్పటికే వాజ్‌పేయి జీవితంపై ఓ పుస్తకం ఉంది. దాని ఆధారంగానే సినిమాను కూడా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
ఉల్లేక్ ఏన్‌పీ రాసిన 'ది అన్‌టోల్డ్ వాజ్‌పేయి: పొలిటీషియన్ అండ్ పారాడాక్స్' పుస్తకం ఆధారంగా 'అటల్' అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. 'మై రహూ యా నా రహూ ఏ దేశ్ రెహనా చాహియే' అనేది ట్యాగ్ లైన్. అంటే నేను ఉన్నా లేకపోయినా దేశం ఉండాలని కోరుకుంటున్నాను అని అర్థం. తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమయిన ఈ చిత్రం.. అటల్ జయంతి సందర్భంగా అంటే డిసెంబర్ 25న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
'Main Rahoon Ya Na Rahoon, Yeh Desh Rehna Chahiye – Shri Atal Bihari Vajpayee.'
— Vinod Bhanushali (@vinodbhanu) June 28, 2022
Presenting #ATAL, a film on the life story of India's most exemplary leader, renowned poet, and visionary.@thisissandeeps @directorsamkhan #KamleshBhanushali #VishalGurnani #JuhiParekhMehta pic.twitter.com/J2Db2l32iy