తారల తరగని సౌందర్యం వెనుక 'ఆమె' కష్టం
వయసు మీద పడ్డా తానే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ కావాలి ఇటు దర్శక నిర్మాతలకు అటు హీరోలకు.;
చక్కని చుక్క చిక్కినా అందమే అంటారు. మరి సన్నగా, నాజుగ్గా అవ్వాలంటే మునుపటి శరీరాన్ని, ముడతలు పడని చర్మాన్ని సొంతం చేసుకోవాలంటే వర్కవుట్లు చేయాలి.. ఫిట్‌నెస్ ట్రయినర్లు చెప్పినట్టు వినాలి. ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లైనా, వయస్సు నలభైకు చేరుతున్నా వన్నె తరగని అందం ఆ నటీమణుల సొంతం.
ఇండస్ట్రీలో నాలుగు కాలాల పాటు నిలవాలి, మరిన్ని అవకాశాలు రావాలీ అంటే వయసు మీద పడ్డా తానే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ కావాలి ఇటు దర్శక నిర్మాతలకు అటు హీరోలకు. అందుకోసం ఆమె పడే తాపత్రయం అంతా ఇంతా కాదు.
నటీమణుల శరీర సౌష్టవం చెక్కిన శిల్పంలా ఉండాలంటే నమ్రతా పురోహిత్ లాంటి ఫిట్‌నెస్ శిక్షకులు ఉండాల్సిందే. కరీనా కపూర్, మలైకా అరోరా, సోనాక్షీ సిన్హా, జాన్వీ కపూర్, సారా అలీఖాన్‌లకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పని చేస్తున్న నమ్రత చెబుతున్న విశేషాలివి..
సెలబ్రీటీల ఫిట్‌నెస్ జాబితాలో ఇప్పుడు యోగా, పిల్లేట్స్ చేరాయి. ఇవి రెండు బాడీని కూల్ చేస్తాయి.. శరీరానికి, మనసుకు వ్యాయామాన్నిచ్చే వర్కవుట్స్ ఇవి. అంతేకాదు దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు రాకుండా చూస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు రాకుండా చూస్తాయి.
తన వద్ద ఫిట్‌నెస్ శిక్షణ పొందిన సెలబ్రెటీలు, ఫిట్‌నెస్ మంత్ర గురించిన పలు విషయాలను 'ది లేజీ గాళ్స్ టు బీయింగ్ ఫిట్' అనే పుస్తకంలో రాశారు.
వారంలో అయిదు నుంచి ఆరు రోజులు వ్యాయామాలు చేయడం వలన పాజిటివ్ ఆలోచనలు వస్తాయి అని చెబుతోంది నమ్రతా పురోహిత్. మరి అందంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ఈ రోజు నుంచి వ్యాయామ సాధన మొదలు పెడితే మంచిదేమో.